సుశాంత్ సూసైడ్ కేసు: బాంద్రా పోలీస్ స్టేషన్‌లో సంజయ్ లీలా భన్సాలీ
యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో ముంబై పోలీసులు తమ విచారణను వేగవంతంగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసుతో అనుబంధం ఉన్న వ్యక్తులను విచారించి వారి స్టేట్‌మెంట్స్‌ను రికార్డు చేశారు. గత 15 రోజుల్లో దాదాపు 29 మందిని బాంద్రా పోలీసులు విచారించడం గమనార్హం.
బాలీవుడ్‌లో బంధుప్రీతి, అవుట్ సైడర్ అనే కారణాలను చూపుతూ 6 సినిమాలను సుశాంత్ సింగ్ నుంచి లాగేసుకొన్నారనే విషయంపై పెద్ద చర్చ జరుగుతున్నది. ఆ కారణంగానే సుశాంత్ డిప్రెషన్‌కు గురయ్యాడు. గత ఆరు నెలలుగా డిప్రెషన్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్నారనే విషయాన్ని స్నేహితులు వెల్లడించారు.

అయితే ఒకట్రెండు సినిమా ఆఫర్లు ఇచ్చి సుశాంత్‌ను తిరస్కరించారనే ఆరోపణలు రావడంతో ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని ముంబై పోలీసులు విచారించాలని నిర్ణయించారు. ఆ క్రమంలో భన్సాలీని జూలై 6వ తేదీన విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేశారు. దాంతో ఆయన సోమవారం బాంద్రా పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు.
సోమవారం ఉదయమే భన్సాలీ ముంబైలోని బాంద్రా పోలీస్ స్టేషన్‌కు చేరుకొన్న ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. ఆయన పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లే ఫోటోలను మీడియా తమ కెమెరాల్లో బంధించింది. ప్రస్తుతం భన్సాలీ బాంద్రా పోలీసుల అదుపులో ఉన్నారు. రాంలీలా, ఇతర సినిమాల్లో ఆయన ఆఫర్లను ఎందుకు తిరస్కరించారు? సుశాంత్‌తో తనకు ఉన్న సంబంధాలు? బాలీవుడ్‌లో బంధుప్రీతి ఉందా అనే కోణాల్లో విచారించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











