సుశాంత్ సింగ్ మృతి.. నాడు ఎగతాళి చేసిన అలియా.. వారి సినిమాలు చూడమంటూ నెటిజన్స్ ఫైర్
సుశాంత్ మరణం బాలీవుడ్‌లో కలకలం సృష్టిస్తోంది. సుశాంత్‌ది ఆత్మహత్యే అని తెలుస్తున్నా.. అందరూ హత్యే అని కామెంట్స్ చేస్తున్నారు. అందరూ కలిసి చంపేశారని బాలీవుడ్‌ను వేలిత్తి చూపిస్తున్నారు. గతంలో సుశాంత్‌ను కించపరిచిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ కరణ్ జోహర్, అలియా భట్‌లను నెటిజన్స్ ఏకిపారేస్తున్నారు. అంతా అయిపోయాక ఇప్పుడు ఓ ట్వీట్ వేసి చేతులు దులుపుకుంటున్నారని ఫైర్ అవుతున్నారు. అసలింతకీ ఏం సోషల్ మీడియలో ఏం జరుగుతోంది ఓ సారి చూద్దాం.

సుశాంత్ ఆత్మహత్య..
సుశాంత్ ఆదివారం బాంద్రాలోని తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఇది ఆత్మహత్య కాదని అందరూ కలిసి చేసిన హత్యేనని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. బాలీవుడ్‌లోని నెపోటిజమ్ (బంధుప్రీతి) ఇందుకు కారణమని నెటిజన్స్ ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు.

నాటి వీడియో వైరల్..
బంధుప్రీతికి వ్యతిరేకంగా కంగనా రనౌత్ ఎంతో కాలంగా పోరాడుతూనే ఉంటుంది. సందర్భంగా దొరికిన ప్రతీ సారి కరణ్ జోహార్, స్టార్ కిడ్స్‌పై సెటైర్స్ వేస్తూనే ఉంటోంది. అయితే సుశాంత్ మరణ వార్త బయటకు వచ్చాక కంగనా మాట్లాడిన మాటలు తెగ వైరల్ అవుతున్నాయి.

అలాంటి వారే కావాలి..
బాలీవుడ్‌లో పది, పన్నెండో క్లాసులు ఫెయిల్ అయిన వారే రాణించగలుగుతారని అలియా భట్, వరుణ్ ధావన్ వంటి వారిపై సెటైర్స్ వేస్తున్నారు. ఇంజనీరింగ్‌లో జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించిన ప్రతిభాశాలి అయిన సుశాంత్‌కు చోటు ఉండదని ఆవేదన చెందుతున్నారు. బ్యాక్ గ్రౌండ్ లేకుండా నిలదొక్కుకోవడం మరింత కష్టమని సుశాంత్ మరణం మరోసారి నిరూపించిందని కామెంట్స్ చేస్తున్నారు.

ఎగతాళి చేసిన అలియా..
ఒకానొక సమయంలో కాఫీ విత్ కరణ్ షోలో సుశాంత్‌ను కించపరిచేలా అలియా భట్ వ్యాఖ్యలు చేసిందని, ఆ ఇద్దరూ కలిసి తెగ నవ్వారని నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు మాత్రం నాటకాలు ఆడుతున్నారని అలియా, కరణ్‌పై ఫైర్ అవుతున్నారు.

ఇకపై వారి సినిమాలు చూడం..
సుశాంత్ మరణానికి బాలీవుడ్‌లోని నెపోటిజమ్ కారణమని భావించిన నెటిజన్లు.. ఇకపై వారి సినిమాలను చూడకూడదని నిర్ణయించుకుంటున్నారు. కరణ్ జోహర నిర్మించే సినిమాలను చూడకూడదని నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











