సుశాంత్ సూసైడ్ కేసు: 10 గంటలపాటు పోలీసుల అదుపులో యువ హీరోయిన్.. ఎవరీ సంజన
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసు దర్యాప్తును బాంద్రా పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ఇప్పటి వరకు యష్ రాజ్ ఫిలింస్ ప్రతినిధులను, క్యాస్టింగ్ డైరెక్టర్లను ప్రత్యేకంగా విచారించారు. అంతేకాకుండా సుశాంత్ సన్నిహితులు, స్నేహితులను కూడా ప్రశ్నిస్తున్నారు. సుశాంత్ డిప్రెషన్‌కు కారణాలు ఏమిటి? ఆత్మహత్య చేసుకోవడానికి బలంగా ప్రభావం చూపిన అంశాలు ఏమిటనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
అయితే మంగళవారం యువ హీరోయిన్ సంజన సంఘిని ఏడుగంటలపాటు అదుపులో ఉంచుకోవడం చర్చనీయాంశమైంది. యువ హీరోయిన్‌ను సంజనను అన్ని గంటలపాటు ఎందుకు విచారించారు? ఏం విచారించారనే విషయం ఆసక్తిగా మారింది. ఇంతకు సంజన సంఘీ ఎవరు? అనే ప్రశ్నలు నెటిజన్లలో లెవనెత్తడం ప్రారంభమయ్యాయి. ఇక వివరాల్లోకి వెళితే..

బాలనటిగా ఇండస్ట్రీలోకి
సంజనా సంఘీ బాలనటిగా బాలీవుడ్‌లోకి ప్రవేశించారు. ఆమె వయసు 21 సంవత్సరాలు. చిన్న వయసులోనే హిందీ పరిశ్రమలోకి ప్రవేశించిన సంజన ఇప్పటికే మూడు బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు. ప్రతిభావంతురాలైన బాల నటిగా ఇప్పటికే ఆమెకు మంచి ఇమేజ్ ఉంది.

రాక్‌స్టార్ చిత్రం ద్వారా
ఇక సంజన సంఘీ 201లో ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించిన రాక్‌స్టార్ చిత్రంలో హీరోయిన్ నర్గీస్ ఫక్రీకి సోదరిగా నటించారు. ఆ చిత్రంలో బాలనటిగా మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత 2017లో హిందీ మీడియం చిత్రంలో మీతా అనే యువతిగా అతిథి పాత్రలో కనిపించారు. అదే క్రమంలో ఫక్రే రిటర్న్స్ అనే చిత్రంలో బాలనటిగానే నటించింది.

బాలీవుడ్‌కు సంబంధం లేని ఫ్యామిలీ నుంచి
బాలీవుడ్‌లో ఎలాంటి మూలాలు లేని కుటుంబం నుంచి సంజన సంఘీ హిందీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. కేవలం ప్రతిభను మాత్రమే నమ్ముకొని అవకాశాలను చేజిక్కించుకొన్నారు. అలా ఇప్పుడు ఏకంగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన దిల్ బేచారా చిత్రంలో హీరోయిన్‌గా ఆఫర్‌ను చేజిక్కించుకొన్నారు.

దిల్ బేచారా చిత్రంలో హీరోయిన్‌గా
ఇక దిల్ బేచారా చిత్రానికి సుశాంత్ మిత్రుడు, క్యాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ చాబ్రా దర్శకుడిగా మారారు. రాక్‌స్టార్ సినిమా సమయంలో క్యాస్టింగ్ డైరెక్టర్‌గా వ్యవహరించిన చాబ్రా దృష్టిలో సంజనా పడింది. అప్పటి నుంచి ఆమె ప్రతిభను గమనిస్తున్న చాబ్రా సుశాంత్ పక్కన హీరోయిన్‌గా అవకాశాన్ని ఇచ్చారు.

తొలిసారి హీరోయిన్‌గా ఆఫర్
సుశాంత్ సింగ్ పక్కన హీరోయిన్‌గా నటించే ఆఫర్ దక్కడంపై అప్పట్లో సంజన సంఘీ ట్విట్టర్‌లో స్పందించారు. హాలీవుడ్ మూవీ ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్ అనే సినిమాకు రీమేక్‌గా వస్తున్న సుశాంత్ సింగ్ మూవీలో నటించడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా నా జీవితాన్ని మార్చేస్తుందనే నమ్మకం నాకు ఉంది. దిల్ బేచారా మూవీలో ఆఫర్ రావడం గర్వంగా ఫీలవుతున్నాను అంటూ సంజన సంఘీ పేర్కొన్నారు.
Recommended Video

10 గంటలపాటు విచారణ
ఇక దిల్ బేచారా మూవీ చిత్రం విడుదలకు సిద్దమవుతున్న నేపథ్యంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపింది. సూసైడ్ అనంతరం దర్యాప్తులో భాగంగా సంజన విచారణ 10 గంటలపాటు సాగింది. ఈ సందర్బంగా సుశాంత్‌తో ఉన్న పరిచయాన్ని, అతడి మానసిక పరిస్థితిని అడిగి తెలుసుకొన్నట్టు సమాచారం. యువ హీరోయిన్ చెప్పిన విషయాలను జాగ్రత్తగా పరిశీలించిన పోలీసులు ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసినట్టు తెలిసింది.


Click it and Unblock the Notifications











