twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    50 సిమ్ కార్డులు మార్చిన సుశాంత్ సింగ్.. సూసైడ్ కేసు దర్యాప్తుపై పెరుగుతున్న అనుమానాలు

    |

    బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసులో అన్నో అనుమానాలను అడ్వకేట్ ఇష్కరన్ బండారీ వ్యక్తం చేశారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలనే డిమాండ్‌తో ప్రముఖ న్యాయవాది, ఎంపీ సుబ్రమణ్యస్వామి పర్యవేక్షణలో ఇష్కరన్ పరిశోధన చేస్తున్నారు. ఈ కేసులో ముంబై పోలీసులు చేస్తున్న దర్యాప్తుపై ఆయన అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. జాతీయ టెలివిజన్ ఛానెల్ రిపబ్లిక్ టీవీ సోమవారం జరిపిన డిబేట్‌లో ఇష్కరన్ అనేక సందేహాలను వ్యక్తం చేశారు. ఆ వివరాల్లోకి వెళితే...

    Recommended Video

    Sushant Singh Rajput : మరణానికి ముందు ఒక్క నెలలోనే 50 సిమ్ కార్డులు మార్చిన Sushant
    50 సిమ్ కార్డుల మార్చడంపై

    50 సిమ్ కార్డుల మార్చడంపై

    ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ వెల్లడించినట్టు చెబుతున్న ప్రకారం.. ఒక్క నెలలోనే సుశాంత్ 50 సిమ్‌కార్డులు మార్చారు. అలా సిమ్ కార్డులు ఎందుకు మార్చాల్సి వచ్చింది. అలాగే ఆ 50 సిమ్ కార్డుల గురించి పోలీసులు ఆరా తీశారా? వాటిని స్వాధీన పర్చుకొన్నారా? అంటూ ముంబై పోలీసులకు న్యాయవాది ఇష్కరన్ కొన్ని ప్రశ్నలు వదిలారు.

    ఆ దిశగా దర్యాప్తు జరగాలి

    ఆ దిశగా దర్యాప్తు జరగాలి


    ఎవరైనా ఒకటో, రెండో సిమ్ కార్డులు మారిస్తే.. సరే.. కనీసం మూడోది మార్చారనే విషయం దృష్టికి వచ్చినప్పుడు కనీసం అనేక అనుమానాలు రావాలి. 50 సిమ్ కార్డులు మార్చారని జాతీయ మీడియా కథనాలు వెల్లడించినప్పుడు ఆ దిశగా ముంబై పోలీసుల దర్యాప్తు ఏదైనా జరిగిందా అనే అనుమానాన్ని ఇష్కరన్ వ్యక్తం చేశారు. ఇలాంటి లోపాలు సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలనే డిమాండ్ వ్యక్తమవుతున్నది.

    ఇంటిని సీజ్ చేయకపోవడంపై సందేహాలు

    ఇంటిని సీజ్ చేయకపోవడంపై సందేహాలు

    అలాగే సుశాంత్ మరణం జూన్ 14వ తేదీ మధ్యాహ్నం తర్వాత వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత పోలీసులు సీన్ ఆఫ్ ఎవిడెన్స్‌ను సీల్ చేశారా? ఆ ఇంటిని సీజ్ చేయలేదనే వార్తలు బయటకు వస్తున్నాయి. ఈ విషయంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై ముంబై పోలీసులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో కంగన రనౌత్ కూడా అనే అనుమానాలు వ్యక్తం చేశారు. వాటిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ ఇష్కరన్ ఘాటుగా స్పందించారు.

    సీసీటీవీ రికార్డులపై

    సీసీటీవీ రికార్డులపై


    ఇక సుశాంత్ ఇంటికి సంబంధించిన సీసీటీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల సమాచారాన్ని ముంబై పోలీసులు స్వాధీనం చేసుకొన్నారా? ఈ కేసు దర్యాప్తుపై సింపులు ప్రశ్నలపై నెటిజన్లు అనేక సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. చాలా విషయాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఈ కేసును సీబీఐ దర్యాప్తుకు అప్పగించాలనే డిమాండ్ చేస్తున్నాం. ఈ మేరకు ముంబై పోలీసులకు లేఖ రాశాను అని ఇష్కరన్ బండారీ వెల్లడించారు.

    38 మందిని విచారించిన ముంబై పోలీసులు

    38 మందిని విచారించిన ముంబై పోలీసులు


    సుశాంత్ కేసు దర్యాప్తు ముగింపుకు వచ్చిందనే వాదన ముంబై పోలీసుల నుంచి వచ్చిందనే నేపథ్యంలో నెటిజన్లు సీబీఐ విచారణకు డిమాండ్‌ చేస్తున్నారు. జూన్ 14వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఈ కేసులో 38 మందిని విచారించారు. యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రతినిధులు, హీరోయిన్లు రియా చక్రవర్తి, సంజనా సంఘీ, భన్సాలీ, ఆదిత్యా చోప్రా తదితరులు ఉన్నారు. ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలో సుశాంత్ మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ రాజకీయ నేతలు కేంద్రానికి లేఖ రాశారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు అవసరమని పేర్కొన్నారు.

    English summary
    Ishkaran Bhandari rises doubt over Mumbai police investigation on Sushant singh Rajput case. He raise his voice why polices are not taking this point in the investigation. Bollywood fire brand, Actress Kanagana Ranaut also fires on Bollywood in Republic Television's Arnab Goswami interview. She made sensational comments in the interview. This interview promo goes viral in the social media
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X