సుశాంత్ చివరి చిత్రం ట్రైలర్ రెడీ.. కొత్త పోస్టర్ వైరల్
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ ఆత్మహత్య ఘటన ఇంకా ఎవ్వరి హృదయాల్లోంచి వెళ్లడం లేదు. ఇప్పటికే దాదాపు 20 రోజులు కావస్తున్నా సుశాంత్ జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి. సుశాంత్‌ది ఆత్మహత్య కాదని, హత్యేనని ఆయన ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. సుశాంత్ మృతి విషయంలో రోజుకో రకమైన చర్చ జరుగుతోంది. సుశాంత్ కేసులో సీబీఐ ఎంక్వైరీ జరగాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అదంతా ఓ వైపు నడుస్తుండగా..సుశాంత్ నటించిన చివరి చిత్రం దిల్ బేచారా నుంచి ఓ అప్ డేట్ వచ్చింది.
సుశాంత్ చివరగా నటించిన చిత్రం దిల్ బేచారా. ఈ చిత్ర దర్శకుడు ముఖేష్ ఛబ్రా, సుశాంత్ ఇద్దరూ ఎప్పటి నుంచో మంచి స్నేహితులు. గతంలో ఎప్పుడో అతనికి సుశాంత్ ఓ మాట ఇచ్చాడ. నీ డెబ్యూ సినిమాలో హీరోగా చేస్తానని దర్శకుడి ఇచ్చిన మాటకు కట్టుబడి దిల్ బేచారాలో నటించాడట. సుశాంత్ మరణంపై ఎమోషనల్ అయిన ముఖేష్ ఛబ్రా ఆయనకు నివాళిగా ఈ సినిమాను విడుదల చేయాలని ఫిక్స్ అయ్యాడు.

అందుకే ఈ సినిమా ఓటీటీలో ప్రతీ ఒక్కరూ వీక్షించేలా వెసులు బాటు కల్పించారు. హాట్ స్టార్‌లో ఈ చిత్రాన్ని ప్రతీ ఒక్కరూ ఉచితంగా వీక్షించవచ్చని ప్రకటించారు. ఈ నెల 24న ఈ సినిమా అందరికీ అందుబాటులోకి రానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్ డేట్‌ను ప్రకటించారు. రేపు ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేయబోతోన్నట్టు యూనిట్ ప్రకటించింది. సుశాంత్ చివరి చిత్రం కావడంతో అందరికీ ఇది ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుందని తెలుస్తోంది. అయితే కొందరు మాత్రం ఈ చివరి సినిమా బిగ్ స్క్రీన్‌పై రిలీజ్ చేస్తే బాగుండేదని అభిప్రాయ పడుతున్నారు.


Click it and Unblock the Notifications











