పక్క దారి పట్టిన సుశాంత్ సింగ్ మరణం మిస్టరీ.. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు..
అసలే కరోనా వైరస్ కారణంగా సినిమా ఇండస్ట్రీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో బాలీవుడ్ కి కోలుకోలేని దెబ్బ పడింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం ఒక్కసారిగా అందరిని షాక్ కి గురి చేసింది. మొదట సూసైడ్ అని ముంబై పోలీసులు తేల్చిచెప్పారు. కానీ ఈ విషయంలో ఎదో మిస్టరీ దాగి ఉన్నట్లు అనేక రకాల ఆరోపణలతో కేసు ఒక్కసారిగా యూ టర్న్ తీసుకుంది. సరిగ్గా రెండు నెల క్రితం కనిపించిన వాతావరణం ఇప్పుడు కనిపించడం లేదు.

మొదట నెపోటిజమ్ కామెంట్స్
సుశాంత్ సూసైడ్ చేసుకున్నాడు అనగానే అతని మృతికి గల అనుమానాలు ఒక్కొక్కటిగా మీడియాలలో హాట్ టాపిక్ గా నిలిచాయి. మొదట నెపోటిజమ్ పై ఏ రేంజ్ లో విమర్శలు వచ్చాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కరణ్ జోహార్ నుంచి చిన్న స్థాయి నట వారసుల వరకు ఎవరిని వదిలిపెట్టకుండా ఒక రేంజ్ లో ఆడుకున్నారు. నెపోటిజమ్ వల్లే అతను చనిపోయాడని సోషల్ మీడియాలో భారీ ఉద్యమమే నడిపారు.

విచారణ సంస్థలు రంగంలోకి దిగినా
సుశాంత్ సింగ్ కేస్ ఫైల్ ఎంతో మంది అధికారుల చేతులు మారింది. ముంబై పోలీసులు, బీహార్ పోలీసులు అలాగే సీబీఐ, ఈడీ, ఏన్సీబీ... ఇలా బలమైన పవర్స్ ఉన్న విచారణ సంస్థలు రంగంలోకి దిగాయి. పైగా మీడియా కూడా సీక్రెట్ చాట్స్ బయటపెట్టడం ఆపరేషన్స్ నిర్వహించడం వంటి విషయాలు కూడా హైలెట్ అయ్యాయి.

ఫైనల్ టార్గెట్ రియా చక్రవర్తి
ఇక ఫైనల్ గా ఇప్పుడు టార్గెట్ మొత్తం రియా చక్రవర్తి వైపే మళ్ళింది. ఆమె సుశాంత్ నుంచి 15కోట్ల వరకు కాజేసిందని ఆరోపణలు ఒక రేంజ్ లో వచ్చాయి. కానీ అది నిజం కాదని ఈడీ కొట్టిపారేసింది. ఇక ఇప్పుడు డ్రగ్స్ వ్యవహారం కూడా ప్రధాన అంశంగా మారింధి. కేవలం ఈ ఒక్క కేసు విషయంలో మాత్రమే సరైన ఆధారాలు బయటపడ్డయని అనిపిస్తోంది.
Recommended Video

అసలు మిస్టరీని ఎవరు పట్టించుకోరా?
ఇక కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు సుశాంత్ కేసు విచారణలో అసలైన మర్డర్ మిస్టరీ ఇప్పుడు మరో మిస్టరీ గా మారింది. అసలు ఆ మిస్టరీని ఎవరు పట్టించుకోరా ? అనే కామెంట్స్ వస్తున్నాయి. డ్రగ్స్ వ్యవహారం కారణంగా అసలు విషయం పక్కదారి పట్టిందా అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి.
ఇక మరోవైపు ఈ డ్రగ్స్ వ్యవహారంలో సుశాంత్ ని కూడా విలన్ చేసేశారు. చూస్తుంటే ఈ హీరో మరణం మిస్టరీపై ఇప్పట్లో క్లారిటీ వచ్చేలా లేదని అనిపిస్తోంది.


Click it and Unblock the Notifications