Don't Miss!
- Sports
INDvsAUS : భారత్‌తో టెస్టు సిరీస్ ముందు.. బెంగళూరులో ఆస్ట్రేలియా జట్టు ప్రాక్టీస్ సెషన్స్
- News
హైదరాబాద్‌లో మరో దిగ్గజ సంస్థ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్: 1800 మందికి ఉపాధి
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Lifestyle
ఈ రాశుల వారు భగ్నప్రేమికులు, అలా పడిపోతారు ఇలా విడిపోతారు
- Finance
Adani Enterprises FPO: అనుకున్నది సాధించిన అదానీ.. మూడో రోజు మ్యాజిక్.. ఏమైందంటే..
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Sushanth death caseలో మరో ట్విస్టు.. సారా ఆలీఖాన్ పేరు తెరపైకి, సుశాంత్ ఫ్యామిలీపై రియా సంచలన ఆరోపణలు
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసు అనేక మలుపు తిరుగుతూ దర్యాప్తుపరంగా ముందుకెళ్తున్నది. సుశాంత్ కేసుతో ముడిపడి ఉన్న డ్రగ్స్ మాఫియా కేసులో బాలీవుడ్ నటి రియా చక్రవర్తిపై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) దాఖలు చేసిన చార్జిషీట్‌ను ప్రముఖ జాతీయ ఛానెల్ జీ న్యూస్ బహిర్గతం చేసింది. ఆ చార్జిషీట్‌లో సుశాంత్ కుటుంబం, సారా ఆలీ ఖాన్‌పై రియా చక్రవర్తి చేసిన సంచలన ఆరోపణలు ఏమిటంటే...
Recommended Video

సుశాంత్ వాడిన డ్రగ్స్ గురించి
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ వాడిన క్లోమోనెజెపాన్ డ్రగ్స్ గురించి రియా చక్రవర్తి ఎన్సీబీకి వెల్లడించినట్టు ఆ చార్జిషీట్‌లో పేర్కొన్నారనే విషయం బయటకు వచ్చింది. ఈ క్రమంలో సోదరి మీతూ కలిసి ఉంటున్న సమయంలో సుశాంత్‌కు మరణం తప్పదనే భయం ఏర్పడింది. తనతో అఫైర్ మొదలు కావడానికి ముందే సుశాంత్ డ్రగ్స్ బానిస అయ్యాడు. సుశాంత్‌తోపాటు ఫ్యామిలీ మొత్తం కలిసి డ్రగ్స్ తీసుకొనే వారు అని రియా చక్రవర్తి సంచలన ఆరోపణలు చేసింది.

ప్రమాదకరమైన డ్రగ్స్ వాడిన సుశాంత్
సుశాంత్ డ్రగ్స్ వాడకంపై రియా చక్రవర్తి మరింత వివరణ ఇస్తూ.. క్లోమ్నేజెపాన్ డ్రగ్ ఎంత ప్రమాదకరమో గూగుల్‌లో వెతికి నేను నా సోదరుడు షోవిక్ తెలుసుకొన్నాం. ఆ డ్రగ్‌ను వాడమని సుశాంత్‌కు డాక్టర్ నికితా షా ప్రిస్క్రైబ్ చేశారు అంటూ రియా చక్రవర్తి ఎన్సీబీ అధికారులకు వెల్లడించినట్టు చార్జిషీట్‌లో పేర్కొన్నారు. ఆమె చెప్పినట్టుగా భావిస్తున్న రెండు రిపోర్టులు ఇప్పుడు మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సారా ఆలీ ఖాన్ కూడా నాతో డ్రగ్స్
ఇదిలా ఉండగా, సైఫ్ ఆలీ ఖాన్ కూతురు హీరోయిన్ సారా ఆలీ ఖాన్ డ్రగ్స్ వాడకాన్ని కూడా రియా చక్రవర్తి అధికారులకు వెల్లడించారు. చేతితో చుట్టిన మారిజువానా జాయింట్స్ నాతో కలిసి సారా ఆలీ ఖాన్ వాడేది. మత్తు పదార్థాలతో చేసిన సిగరెట్లును ఇద్దరం కలిసి తాగే వాళ్లం అంటూ రియా చక్రవర్తి తన వాగ్మూలంలో వెల్లడించినట్టు జీ న్యూస్ తన కథనంలో వెల్లడించింది.

సుశాంత్‌కు మీతూ సోదరి వల్లే
డ్రగ్స్ వాడకమే సుశాంత్ మరణానికి కారణం కూడా. తన సోదరి మీతూతో ఉన్న సమయంలో ఇలాంటి దారుణాలు చోటుచేసుకొన్నాయి. మారిజువానా కూడా నాతో కలిసి సుశాంత్ తీసుకొనే వాడు. ఓ దశలో ఆయన ఆరోగ్యం దారుణంగా క్షీణించింది. ఆయనను హాస్పిటల్‌లో చేర్పించాలని బలవంతం చేశాను. అందుకు సుశాంత్ ఒప్పుకోలేదు అంటూ రియా చక్రవర్తి వెల్లడించింది.

సుశాంత్‌తోపాటు కుటుంబ సభ్యులందరూ
సుశాంత్ మారిజువానా వినియోగించే విషయం ఆయన కుటుంబ సభ్యులందరికీ తెలుసు. ఆయన సోదరి ప్రియాంక సింగ్, బావ సిద్దార్థ్ కూడా డ్రగ్స్ ఉపయోగించే వారు. సుశాంత్ సింగ్ కోసం వారు డ్రగ్స్ సమకూర్చేవారు అని రియా చక్రవర్తి సంచలన ఆరోపణలు చేసింది. సుశాంత్ సింగ్ మరణించి ఏడాది కావోస్తున్న నేపథ్యంలో ఆయనకు సంబంధించిన విషయాలు మరోసారి మీడియాలో సెన్సేషనల్ అవుతున్నాయి. జూన్ 14 తేదీన సుశాంత్ ముంబైలోని తన ఫ్లాట్‌లో మరణించిన సంగతి తెలిసిందే.