కరణ్ జోహార్ నువ్వో మాఫియా. బంధుప్రీతికి బ్రాండ్‌వి.. నెటిజన్ల ఫైర్, కంగన వీడియో వైరల్
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం నేపథ్యంలో హిందీ చిత్రసీమలో బంధుప్రీతి, ఫేవరిజంపై సినీ ప్రముఖులు, నెటిజన్లు భగ్గుమంటున్నారు. బాలీవుడ్‌లో ఓ వర్గానికి ప్రోత్సాహం అందిస్తున్నారు, సినీ హీరోల వారసత్వంతో వచ్చే పిల్లలకు సపోర్టు చేస్తారనే ఆరోపణలపై దర్శక, నిర్మాత కరణ్ జోహర్‌పై మండిపడుతున్నారు. తాజాగా కంగన రనౌత్‌తోపాటు పలువురు సినీ ప్రముఖులు చేసిన ఆరోపణలు ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

కంగన ఇంటర్వ్యూ వీడియో వైరల్
సుశాంత్ సింగ్ మరణం సందర్భంగా గతంలో కంగన రనౌత్‌తో కరణ్ జోహర్ చేసిన ఇంటర్వ్యూ వైరల్‌గా మారింది. బాలీవుడ్‌లో బంధుప్రీతికి, ఫేవరిటిజానికి నీవు బ్రాండ్ అంబాసిడర్‌వి. నా బయోపిక్‌లో నీ పాత్రను తప్పక చేరుస్తాను. నీలాంటి వాళ్ల పాత్రలను కచ్చితంగా తెరకెక్కిస్తాను. మీరంతా ఓ రకమైన మాఫియా అంటూ కరణ్‌పై కంగన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో కంగన, కరణ్ ట్విట్టర్‌లో ట్రెండింగ్ నిలిచారు.

ఎవరూ సహాయం చేయరు..కేఆర్కే
వివాదస్పద నటుడు, సినీ విమర్శకుడు కేఆర్కే స్పందిస్తూ.. సుశాంత్ ఆత్మహత్య చేసుకోకుండా ఎవరినైనా సహాయం అందించాలని అడిగితే బాగుండు అనే మాటలు బాలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. అలా మాట్లాడే వారంత అబద్దాల కోరులు. బాలీవుడ్‌లో బయటి నుంచి వచ్చే వ్యక్తులకు ఎవరూ సహాయం చేయరు. ప్రతీ ఒక్కరు తన సమస్యలపై తానే పోరాడాలి అంటూ కమల్ ఆర్ ఖాన్ ట్వీట్ చేశారు.

సుశాంత్ మరణం తర్వాత మాటలొద్దు
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి తర్వాత అందరూ సానుకూలంగా మాట్లాడుతున్నారు. నాకు నీవు.. నీకు నేను అంటూ బాలీవుడ్‌లో ఓ నీచపు కూటమి మాటలు చెబుతున్నారు అంటూ వివేక్ రంజన్ అగ్నిహోత్రీ అనే సెలబ్రిటీ ఘాటుగా స్పందించారు. ఇలాంటి సెలబ్రిటీల కామెంట్ల నేపథ్యంలో అన్ ఫాలో కరణ్ జోహర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

టాప్ సెలబ్రిటీలు పునరాలోచించుకోవాలి
ఇప్పటికైనా బాలీవుడ్ ప్రివిలైజ్‌డ్ క్లబ్ తప్పనిసరిగా కూర్చొని విశ్లేషించుకోవాలి. ఇలాంటి పరిస్థితులపై చర్చలు జరపాలి. బాలీవుడ్‌లో నెలకొన్న పరిస్థితులపై పునరాలోచన చేయాలి. ఇంతకంటే నన్ను వివరించమని అడుగవద్దు. మనం జాగ్రత్తలు తీసుకొని ఉంటే సుశాంత్ సింగ్ లాంటి మరణాలు సంభవించవు అంటూ అనుభవ్ సిన్హా ట్వీట్ చేశారు.

కంగన మాటలు నిజం
బాలీవుడ్‌లో బంధుప్రీతి, ఫేవరిటిజం ఉందని ఎలుగెత్తి చెప్పిన కంగన రనౌత్ మాటలు ముమ్మాటికి నిజం అంటూ శివ్ ఆరూర్ ట్వీట్ చేశారు. ఇలా పలువురు తనదైన శైలిలో కరణ్ జోహర్‌పై భారీగా దుమ్మెత్తి పోస్తున్నారు. స్టార్ హీరోలు, దర్శకుల సినిమాలను బాయ్‌కాట్ చేయాలి. అప్పుడే ప్రతిభావంతులకు న్యాయం జరుగుతందనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతున్నది.
Recommended Video

సుశాంత్ వ్యవహారం ముందే ఊహించా
అలాగే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై అలియాభట్ తండ్రి ముఖేష్ భట్ స్పందిస్తూ.. సడక్ 2 సినిమా కోసం నేను సుశాంత్‌ను కలిసినప్పుడు ఆయన మానసికంగా కుంగిపోయినట్టు కనిపించారు. ఇలాంటి తీవ్రమైన నిర్ణయమేదో తీసుకొంటారనే ఫీలింగ్ అప్పుడే కలిగింది. సుశాంత్ మాటలను బట్టి ఇలాంటి ముందే ఊహించాను అని ముఖేష్ భట్ చెప్పడం సంచలనం రేపింది.


Click it and Unblock the Notifications











