Don't Miss!
- Sports RCB vs KKR: విరాట్ కోహ్లీ ట్రేడ్ మార్క్ సిక్సర్.. బిత్తరపోయిన మిచెల్ స్టార్క్! వీడియో
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్‌ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్‌ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
సుశాంత్ ఆఖరి సినిమా థియేటర్లలో రిలీజైతే.. బాహుబలి మొత్తం కలెక్షన్స్ ఒక రోజులోనే!
సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ కథానాయకుడిగా నటించిన చివరి చిత్రం దిల్ బేచారా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ డిస్ని+హాట్ స్టార్ లో విడుదలైన విషయం తెలిసిందే. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇక అదే సమయంలో సుశాంత్ సూసైడ్ చేసుకోవడం అందరిని షాక్ కి గురి చేసింది. ఇక ఆ సినిమాకు వచ్చిన వ్యూవ్స్ ని బట్టి చూస్తే విడుదలైన మొదటి రోజే బాహుబలి కంటే హై రేంజ్ లో కలెక్షన్స్ ఉండేవని కథనాలు వెలువడుతున్నాయి.
సుశాంత్ సింగ్ అప్సెట్
రొమాంటిక్ ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన దిల్ బేచారా సమ్మర్ లోనే రిలీజ్ కావాల్సింది. కానీ లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ క్లోజ్ అవ్వడంతో వాయిదా వేశారు. అందువల్ల సుశాంత్ కొంత అప్సెట్ అయ్యాడని టాక్ కూడా వచ్చింది. ఇక చివరికి నిర్మాతలు హాట్ స్టార్ తో ఒప్పందం కుదుర్చుకొని రిలీజ్ చేశారు. ముఖేశ్ చబ్రా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సంజనా సంఘీ కథానాయికగా నటించింది.
గేమ్ ఆఫ్ త్రోన్స్ కంటే హై రేంజ్ లో..
హాట్ స్టార్ అంటే తెలియని వారు కూడా సుశాంత్ సింగ్ సింగ్ ఆఖరి సినిమా కోసం సబ్స్క్రైబర్స్ గా మారారు. దీంతో ఒక్కసారిగా హాట్ స్టార్ రేంజ్ పెరిగిపోయింది. అలాగే దిల్ బేచారాకు విడుదలైన 24గంటలోనే 95మిలియన్ వ్యూవ్స్ రావడం అందరిని ఆశ్చర్యపరిచింది. దాదాపు గేమ్ ఆఫ్ త్రోన్స్ వెబ్ సిరీస్ కంటే కూడా హై రేంజ్ లో పాపులర్ అయ్యింది.
థియేటర్స్ లో వచ్చి ఉంటే..
ఇక దిల్ బేచారాకు వచ్చిన వ్యూవ్స్ బి బట్టి ఒకవేళ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఉంటే కలెక్షన్స్ ఈ స్థాయిలో ఉండేవని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. మొదటి రోజే ఆ సినిమాకు 2000కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చి ఉండేవని బాలీవుడ్ మీడియాలో కూడా కూడా కథనాలు వెలువడుతున్నాయి. అంటే దాదాపు బాహుబలి మొత్తం కలెక్షన్స్ కంటే అది ఎక్కువే అని చెప్పాలి.
900కోట్లు వచ్చేవా?
నిజంగా రెండు వేల కోట్లు రాకపోవచ్చని మరికొందరు అంటున్నారు. దాదాపు టికెట్ కి 100రూపాయలు అనుకున్నా ఒకేరోజు థియేటర్స్ లో ఇంతమంది చూస్తారని గ్యారెంటీ లేదు. కానీ సినిమా మాత్రం మొదటిరోజే మునుపెన్నడు లేనంతగా కలెక్షన్స్ అందుకునేదని మాత్రం చెప్పవచ్చు. వంద రూపాయల టికెట్ అంసుకుంటే మొదటి రోజు కలెక్షన్స్ దాదాపు 900కోట్ల ఉండేదని మరికొందరు అంచనా వేస్తున్నారు.
Recommended Video
హాట్ స్టార్ కి బాగా కలిసొచ్చింది
ఏదేమైనా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి అభిమానులను ఎంతో బాధని కలిగించింది. ఇక ఎమోషనల్ గా ఉన్న సమయంలో దిల్ బేచారా లాంటి ఎమోషనల్ లవ్ స్టోరీని కూడా రిలీజ్ చేయడం హాట్ స్టార్ కి బాగా కలిసొచ్చింది. కానీ థియేటర్స్ లో గనక సినిమా విడుదలై ఉంటే కలెక్షన్స్ రేంజ్ మాత్రం మొదటి రోజే నెవర్ బిఫోర్ అనేలా ఉండేవని చెప్పవచ్చు.