డెంగీతో బాధపడుతున్న హీరో.. షూటింగ్స్ క్యాన్సల్.. ఆందోళనలో ఫ్యాన్స్

రెండు తెలుగు రాష్ట్రాల్లో డెంగీ ఎంతగా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హాస్పిటల్స్ అన్ని రోగులతో కిటకిటలాడుతున్నాయి. వైద్యం అందించలేక కొన్ని చోట్ల చేతులెత్తేస్తున్నారు. డెంగీ భారిన పడి కుటుంబం అంతా మృత్యువాత పడిన ఘటనలు కూడా సంభవించాయి. ఇంతలా వ్యాప్తి అవుతున్న డెంగీ సెలెబ్రిటీలను సైతం వదలడం లేదు.

డెంగీ బారిన పడిన సుశాంత్..

డెంగీ బారిన పడిన సుశాంత్..

తాజాగా బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డెంగీ బారిన పడ్డాడు. యూరప్ ట్రిప్ ను ముగించుకుని వచ్చిన సుశాంత్... అనారోగ్య కారణాలతో వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. ఈ పరీక్షలో డెంగీ సోకినట్టు తేలింది. ఈ నేపథ్యంలో, తన అబుదాభి పర్యటనను సుశాంత్ రద్దు చేసుకున్నాడు.

షెడ్యూల్స్ రద్దు..

షెడ్యూల్స్ రద్దు..

జాతీయ మీడియా కథనం ప్రకారం.. గత కొన్ని రోజులుగా సుశాంత్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. డెంగీ సోకినట్టు వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో, తన వర్క్ షెడ్యూల్ ను ఆయన రీషెడ్యూల్ చేసుకున్నాడు. ఈ వారంలో ఓ కార్యక్రమం కోసం సుశాంత్ అబుదాభి వెళ్లాల్సి ఉంది. కానీ, విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు వైద్యులు సూచించడంతో, అబుదాభి పర్యటనను రద్దు చేసుకున్నాడు. సుశాంత్ తన కోరిక చిట్టాలో ఉన్న వాటిని ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తోన్న సంగతి తెలిసిందే.

డెంగీపై ప్రభుత్వ చర్యలు..

డెంగీపై ప్రభుత్వ చర్యలు..

డెంగీ మహమ్మారి ప్రజలపై దాడి చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలు అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. ఎక్కువ రోజులు నీటిని నిల్వ చేయడం లాంటి చేయకూడదని, ఏ మాత్రం అనుమానం వచ్చినా వైద్యుల దగ్గరకు వెళ్లాలని, మొదటి స్టేజ్‌లోనే డెంగీని అరికట్టాలని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.

Recommended Video

#CineBox : Balakrishna To Play Sr NTR Again? Priyanka Chopra Bought A Lavish House
ప్రేమాయణం గురించి చెబుతూ..

ప్రేమాయణం గురించి చెబుతూ..

ఇటీవల రేహా చక్రవర్తితో ఉన్న బంధం గురించి సుశాంత్ ఓపెన్ అయిన సంగతి తెలిసిందే. ఓ మీడియాతో మాట్లాడుతూ.. ‘మేమిద్దరం ఒకరినొకరు అర్థం చేసుకున్నాం. మా బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నాను. ఇదే విషయాన్ని రెహాతో సైతం చెప్పాను. ఆమె నిర్ణయం కోసం వేచి చూస్తున్నాను' అని వెల్లడించిన విషయం గురించి అందరికీ తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X