twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరణానికి ముందు రోజు.. టెర్రరిస్ట్ సినిమాపై సుశాంత్ చర్చలు..

    |

    బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించి 5 నెలలు గడిచాయి. అయితే ఇంకా అతని మరణానికి గల అసలు కారణాలపై క్లారిటీ లేదు. సూసైడ్ అని దృవీకరించినప్పటికి ఇంకా ఎన్నో అనుమానాలు మిస్టరీగానే మిగిలాయి. భవిష్యత్తులో సుశాంత్ సింగ్ మరణం కూడా బిగ్ మిస్టరీస్ డెత్ స్టోరీలలో ఒకటిగా నిలవనుందనే కామెంట్స్ ఎన్నో వస్తున్నాయి. ఇక సుశాంత్ మరణానికి ముందు రోజు ఒక సినిమాపై చర్చలు జరిపిన విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

    ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్..

    ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్..

    సుశాంత్ సింగ్ ఆఖరి సినిమా దిల్ బెచారా అని అందరికి తెలిసిందే. ఆ సినిమా కూడా పూర్తిగా ఫినిష్ చేయకముందే కన్నుమూశారు. అయితే ఆ సినిమా తరువాత సుశాంత్ చేయాలనుకున్న కొన్ని సినిమాలపై రెగ్యులర్ గా చర్చలు జరుపుతుండేవాడట. ముఖ్యంగా పాకిస్థాన్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ నేపథ్యంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

    కసబ్ జీవితంపై సినిమా..

    కసబ్ జీవితంపై సినిమా..

    ముంబయి 26/11 ఉగ్రదాడి ఇండియాను ఒక్కసారిగా షాక్ కి గురి చేసిన విషయం తెలిసిందే. ఉగ్రవాదుల్లో ఒకడైన అజ్మల్ కసబ్ ని భారత ప్రభుత్వం ఊరి తీసింది. ఆ తరువాత కసబ్ పాత్ర ఆధారంగా సినిమాలు చాలానే వచ్చాయి. అయితే మెయిన్ గా అతని జీవిత ఆధారంగా సినిమా చేయాలని వచ్చిన ఆఫర్ కి సుశాంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

     చనిపోవడానికి ముందు రోజు చర్చలు

    చనిపోవడానికి ముందు రోజు చర్చలు

    సుశాంత్ ఆ సినిమాలో ఎలాంటి పాత్ర చేస్తాడు అనే విషయం బయటకు రాలేదు. కానీ సుశాంత్ మరణానికి ముందు రోజు అంటే జూన్ 13న దర్శక నిర్మాతలతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇండియాటుడే ఒక నివేదికలో తెలిపిన దాని ప్రకారం.. కార్నర్‌స్టోన్‌ ఎల్ఎల్‌పీకి చెందిన ఉదయ్‌సింగ్‌ గౌరీ ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడించారట.

    Recommended Video

    Hero Sudheer Babu Special Interview On 'V' Movie
    వారితో అదే చివరి ఫోన్ కాల్

    వారితో అదే చివరి ఫోన్ కాల్

    చనిపోవడానికి ముందు రోజు సుశాంత్‌కు ఉదయ్‌సింగ్‌ ఫోన్‌ చేసి.. సినిమా డైరెక్టర్‌ నిఖిల్‌ అడ్వాణీ, నిర్మాత రమేశ్‌ తౌరాణీని కాన్ఫరెన్సులో కలిపినట్లు తెలుస్తోంది. దాదాపు ఏడు నిమిషాల పాటు కసబ్ సినిమా గురించి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కరోనా లాక్ డౌన్ వలన డైరెక్ట్ గా కలవడం కుదరదని కొన్ని రోజుల వరకు ఇలానే చర్చలు జరిపేందుకు అందరు డిసైడ్ అయ్యారు. అయితే మరుసటి రోజే సుశాంత్ మరణించడంతో ఆ ప్రాజెక్టుకు బ్రేక్ పడింది. అనంతరం డ్రగ్స్ కోణం నుంచి కేసు వివిధ రకాల మలుపులు తిరిగిన విషయం తెలిసిందే.

    English summary
    You have to know what kind of craze a movie has on YouTube. Songs, teaser, trailer, clicks, the response to the movie automatically increases unimaginable. Recently, Sushant Singh Rajput released the last trailer of the film and received a record number of likes. Trailers that have received most viewings in the past have also been followed by his film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X