నటనకు దూరమవ్వాలని సుశాంత్ ప్లాన్.. ఫార్మ్ హౌస్‌లో వ్యవసాయం: సుశాంత్ ఫ్రెండ్ సిద్దార్థ్
సుశాంత్ సింగ్ మరణానికి అసలు కారణం ఏమిటనేది ఇంతవరకు నిర్దారణ కాలేదు. ఒక వైపు సూసైడ్ మరోవైపు హత్య అనే ఆరోపణల నడుమ సుశాంత్ డెత్ కేసు పెద్ద మిస్టరీగా మారింది. అయితే కేసు ఒక మిస్టరీగా ఉండకూడదని ఇప్పటికే చాలా మంది సినీ తారలు నిజం తెలియాలని సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. ఇక సుశాంత్ కి గత కొంత కాలంగా సన్నిహితంగా ఉంటున్న స్నేహితుడు సిద్దార్థ్ పితాని ఎవరు ఊహించని విషయాన్ని చెప్పాడు.

తీవ్ర స్థాయిలో డిప్రెషన్
సిద్దార్థ్ చెప్పిన దాన్ని భట్టి చూస్తే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గత ఎడాది నుంచి కూడా తీవ్ర స్థాయిలో డిప్రెషన్ లోనే ఉన్నట్లు అనుమానాలు వస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ ఎందుకు ఆ విధంగా మరణించాల్సి వచ్చింది అనే ప్రశ్నలు ఎక్కువవుతున్నాయి. ఇక సుశాంత్ సినిమా ఇండస్ట్రీ నుంచి బయటకు రావాలని చాలా రోజులు నుంచి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

సినిమాల్లో నటించాలని అనుకోవడం లేదు
ఇటీవల సుశాంత్ సింగ్ రాజ్ ఫ్రెండ్, రూమ్ మెట్ సిద్దార్థ్ మీడియాకి ఇచ్చిన వివరణ ప్రకారం ఈ ఎడాది జనవరిలో సుశాంత్ తన కెరీర్ పై ఒక షాకింగ్ కామెంట్ చేసినట్లు చెప్పాడు. ఇక నుంచి సినిమాల్లో నటించాలని అనుకోవడం లేదని ఫోన్ ద్వారా చెప్పాడట. అప్పుడు సిద్దార్థ్ తన ఫ్యామిలీతో ఉండగా నువ్వు నా దగ్గరకు వచ్చి నా రూమ్ లోనే ఉండు. ఇద్దరం కలిసి ఇంకా ఏదైనా వర్క్ చేసుకుందాం అని సుశాంత్ చెప్పినట్లు సిద్దార్థ్ తెలిపాడు.

కొత్తగా బిజినెస్ చేద్దామని
ఇక సిద్దార్థ్ చాలా రోజుల తరువాత సుశాంత్ ఇంటికి చేరుకున్నప్పుడు అతను చాలా బాధతో కనిపించినట్లు వివరణ ఇచ్చాడు. వర్చ్యువల్ రియాలిటీ లేదా ఇతర కంటెంట్ తో ఏదైనా కొత్తగా బిజినెస్ చేద్దామని సుశాంత్ చెప్పినట్లు చెబుతూ.. నాకు మంచి జీతం కూడా ఇస్తానని చెప్పాడని సిద్దార్థ్ తెలియజేశాడు.
Recommended Video

నన్ను వదిలి వెళ్లకని కూడా అన్నాడు
అదే విధంగా సుశాంత్ మరో ముఖ్యమైన విషయం కూడా చెప్పాడని సిద్దార్థ్ మాట్లాడుతూ.. 'నా ఫ్యామిలీని మొత్తం తనే చూసుకుంటానని అన్నాడు. నన్ను వదిలి వెళ్లకని కూడా సుశాంత్ చెప్పాడు. ఇక ముంబైని వదిలేసి తన ఫార్మ్ హౌజ్ లో ఉంటూ ఏదైనా వ్యవసాయం కూడా చేద్దామని అన్నాడు. మొత్తంగా సుశాంత్ ఫిల్మ్ కెరీర్ కి ఎండ్ కార్డ్ పెట్టాలని అనేంతగా మాట్లాడుతూ ఉండేవాడు' అంటూ సిద్దార్థ్ వివరణ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











