సుశాంత్ సింగ్ సూసైడ్ ఎఫెక్ట్.. కొంపముంచిన కరణ్ జోహార్.. రిస్క్‌లో శ్రీదేవి కూతురు
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంకా నెపోటీజమ్ వేడి తగ్గడం లేదు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి వెనుక అసలు కారణాలు వెలువడకముందే అనేక రకాల రుమార్లు బాలీవుడ్ సినీ ప్రముఖులను షాక్ కి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా కరణ్ జోహార్ కి నెపోటీజమ్ కామెంట్స్ నిద్ర లేకుండా చేస్తున్నాయనే చెప్పాలి. అయితే అతని కారణంగా శ్రీదేవి కూతురి జాన్వీ కపూర్ ఇప్పుడు రిస్క్ లో పడినట్లు తెలుస్తోంది.

విమర్శలు ఎన్ని వస్తున్నా...
కేవలం సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారికే కరణ్ జోహార్ లాంటి వాళ్ళు అవకాశాలు ఇస్తూ నెపోటీజమ్ అనే పదానికి బలాన్ని చేకూర్చారని అనేక రకాల కామెంట్స్ వస్తున్నాయి. దీంతో కరణ్ జోహార్ మీడియాకు దూరంగా ఉంటున్నాడు. సోషల్ మీడియా ఎకౌంట్స్ ని పక్కన పెట్టి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. విమర్శలపై ఎలాంటి కామెంట్స్ చేయడం లేదు.

రిస్క్‌లో శ్రీదేవి కూతురు
అయితే బాలీవుడ్ లేటెస్ట్ గా కొత్త తరహా రూమర్స్ వినిపిస్తున్నాయి. కరణ్ జోహార్ తీసుకున్న నిర్ణయం కారణంగా జాన్వీ కపూర్ కెరీర్ రిస్క్ లో పడినట్లు తెలుస్తోంది. దివంగత అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ మొదటి సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినా మళ్ళీ అవకాశాలు వస్తున్నాయి.

కరణ్ జోహార్ సైలెన్స్..
కరణ్ జోహార్ మొదటి నుంచి జాన్వీ కెరీర్ పై స్పెషల్ ఫోకస్ పెట్టాడు. అయితే ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదగాలని చూస్తోన్న జాన్వీకి గుంజన్ సక్సేనా బయోపిక్ హిట్టవ్వడం చాలా ముఖ్యం. ఆ సినిమా ఆగస్టు 15న నెట్ ఫ్లిక్స్ లో డైరెక్ట్ గా రిలీజ్ కానుంది. ఈ సమయంలో ప్రమోషన్స్ తో బిజీగా ఉండాల్సిన కరణ్ జోహార్ చప్పుడు కూడా చేయడం లేదు.

అతన్నే నమ్ముకుంది..
సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటున్న కరణ్ జాన్వీ కపూర్ సినిమా గురించి ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. పైగా జాన్వీతో మరికొన్ని సినిమాలు చేయాలని అనుకున్న కరణ్ జోహార్ ఇప్పుడు ఎలాంటి సినిమాలు చేయడానికి సిద్ధంగా లేడట. కరణ్ జోహార్ తన కెరీర్ ని సెట్ చేస్తాడేమో అని జాన్వీ అతని నిర్ణయాల ప్రకారమే ఇన్నాళ్లు నడుచుకుంటూ వచ్చింది.
Recommended Video

స్టార్స్ పిల్లలకు దూరంగా..
కానీ కరణ్ జోహార్ కొత్త తరహా మార్పు ఆమె కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో చాలా వరకు బయట ప్రొడక్షన్స్ నుంచి ఆఫర్స్ వచ్చినా కూడా కేవలం కరణ్ వద్దన్నాడనే కారణం చేత ఆమె అతనికి చెప్పకుండా ఎలాంటి పనులు చేయలేకపోయింది. ఇక ఇప్పుడు కరణ్ జోహార్.. స్టార్స్ పిల్లలకు దూరంగా ఉండాలని అనుకుంటూ ఉండడంతో ఆమె కెరీర్ కాస్త రిస్క్ లో పడినట్లేనని అనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











