కంగనకు మద్దతు తెలిపిన సుశాంత్ సోదరి... ఆమెకు రక్షణ కల్పించాలని వినతి
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంలో మాదకద్రవ్యాల కోణం వెలుగు చూసిన దగ్గర నుంచీ రియా చక్రవర్తి చుట్టూ ఉచ్చు బిగిసుకుంటూనే ఉంది. దీంతో పాటే ఇప్పుడు యావత్ బాలీవుడ్ డొంక కదిలే అవకాశాలూ పుష్కలంగానే కనిపిస్తూనే ఉన్నాయి. ఇక దీనికి తన వంతు సహకారం అందిస్తానంటోన్న కంగనకు క్రమంగా మద్దతు పెరుగుతోంది.
బాలీవుడ్ లో డ్రగ్ మాఫియా గురించి తనకు తెలిసిన విషయాలు బట్టబయలు చేసేందుకు, నార్కోటిక్స్ బృందం తనకు తగిన రక్షణ కల్పించాల్సిందిగా కంగన కోరింది. ఈ డ్రగ్ మాఫియాపై విచారణ జరిపితే, బాలీవుడ్ లో పెద్ద వాళ్లుగా చెలామణి అవుతున్న వారు సైతం కటకటాల పాలవ్వాల్సి వస్తుందని కంగన ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

తాను టీనేజ్ గా ఉన్న సమయంలో తన మెంటర్ కూడా తనకు డ్రగ్స్ ఇచ్చాడని సంచలన ఆరోపణలు చేసిన కంగన, తానూ పెద్ద పెద్ద పార్టీలకు వెళ్లినప్పుడు అక్కడ భారీ ఎత్తున డ్రగ్స్ తీసుకుంటున్న వారిని చూశారని వెల్లడించింది. ఈమేరకు ట్విట్టర్ లో కంగనకు రక్షణ పేరిట ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్న ఉద్యమానికి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సోదరి శ్వేతా సింగ్ కూడా తన మద్దతు తెలిపింది.
అక్కడితో ఆగని శ్వేత, కంగనకు రక్షణ కల్పించాల్సిన అవశ్యకం పై ప్రధాని మోదికి ట్విట్ చేసింది. మరోవైపు కంగన సైతం స్వఛ్ భారత్ కార్యక్రమం కింద బాలీవుడ్ మురికిగుంటను శుభ్రం చేయాల్సిందిగా ప్రధాని మోదీని కోరింది.


Click it and Unblock the Notifications











