సుశాంత్‌ వ్యక్తిగతంగా తెలియదు.. ఆ విషయాలన్నీ చర్చించుకునేవాళ్లం.. సుష్మితా సేన్ ఎమోషనల్ పోస్ట్

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానంతరం బాలీవుడ్‌లో పరిస్థితులు మారిపోయాయి. జనాలు బాలీవుడ్‌ను చూసే కోణం కూడా మారిపోయింది. సుశాంత్ మరణానికి బాలీవుడ్, నెపోటిజమే కారణమని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సుశాంత్ కేసులో రోజుకో పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుశాంత్ మరణాన్ని ఆయన అభిమానులెవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు.

రోజుకో చర్చ..

రోజుకో చర్చ..

సుశాంత్ మరణంపై సోషల్ మీడియాలో రోజుకో చర్చ నడుస్తూనే ఉంటుంది. కరణ్ జోహర్, సల్మాన్ ఖాన్, సూరజ్ పంచోరి ఇలా ప్రతీ ఒక్కరిపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఓ వైపు పోలీసులు సుశాంత్ కేసును నిశితంగా పరిశీలిస్తుంటే.. మరోవైపు సీబీఐ ఎంక్వైరీ వేయాలని నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి సమయంలో సుశాంత్ నటించిన చివరి చిత్రం దిల్ బేచారా ట్రైలర్ నిన్న విడుదలైంది.

ట్రైలర్ వైరల్..

ట్రైలర్ వైరల్..

దిల్ బేచారా ట్రైలర్ ఆద్యంతం అందర్నీ ఆకట్టుకుంది. క్యాన్సర్‌కు గురైన హీరోయిన్, చావును లెక్కచేయని హీరో మధ్య సాగే సున్నితమైన ప్రేమ కథా చిత్రం. సుశాంత్ నటన, ఆయన డైలాగ్స్ అన్నీ కూడా అందర్నీ కంటతడి పెట్టించాయి. దిల్ బేచారా ట్రైలర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ట్రైలర్‌పై, సుశాంత్ నటనపై మిస్ యూనివర్స్ సుష్మితా సేన్ ఎమోషనల్‌ అయింది.

వ్యక్తిగతంగా తెలియదు..

వ్యక్తిగతంగా తెలియదు..

ఈ మేరకు సుష్మిత సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ‘నాకు సుశాంత్ వ్యక్తిగతంగా తెలియదు.. కానీ ఆయన సినిమాలు, ఇంటర్వ్యూల ద్వారా కాస్త పరిచయమే. తెరపై తెర వెనుక ఎంతో గొప్ప ఎమోషన్స్ అతనిలో ఉన్నాయి. ఆయన గురించి నాకు ఇప్పుడు బాగానే తెలుసని ఫీల్ అవుతున్నాను. ఇదంతా ఆయన ఫ్యాన్స్ వల్లే వారికి ధన్యవాదాలు. అతని సింప్లిసిటీ, గ్రేస్, ప్రేమ, దయా గుణం, ఆ నవ్వుతో ఎంతో మంది జీవితాలను టచ్ చేశాడు.

ఆ విషయాలన్నీ..

ఆ విషయాలన్నీ..

మీ అందరి ప్రేమానురాగాలను ఆయన అనుభూతి చెంది ఉంటాడు.. కేవలం నటుడిగానే కాదు.జ ఓ అద్భుతమైన మానవతా హృదయం ఉన్న మనిషిగా, అందరివాడుగా సుశాంత్ నిలిచి ఉంటాడు. నాకు అతని గురించి తెలిసి ఉండాల్సింది.. అతని పని చేసే అకాశం వచ్చి ఉండాల్సింది.. అతనితో గడిపే సమయం ఉంటే బాగుండేది. ఆయన దగ్గర్నుంచి ఈ విశ్వ రహస్యాలను తెలుసుకుని అందరికీ చెప్పేదాన్ని. అంతేకాకుండా మా ఇద్దరికీ 47 అనే నంబర్ ఎందుకంతా ఇష్టమో చర్చించుకునేవాళ్లం.

Recommended Video

Sushmita Sen Stunning Workouts With Boyfriend Rohman Shawl During Lockdown
ఆల్ ది బెస్ట్..

ఆల్ ది బెస్ట్..

దిల్ బేచారా ట్రైలర్ ఎంతో నచ్చింది. చిత్ర యూనిట్‌లోని ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్. సుశాంత్ ఫ్యామిలీకి, అతని స్నేహితులకు, ఫ్యాన్స్‌కు అభినందనలు' అంటూ శాంతి, బలం చేకూరాలని కోరకుంది. దిల్ బేచారా ట్రైలర్ ప్రపంచ రికార్డులను దక్కించుకుంది. అత్యధిక మంది లైక్ చేసిన ట్రైలర్‌గా నిలబెట్టి సుశాంత్‌కు అసలైన నివాళిగా అర్పించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X