50 ఏళ్ల సుస్మిత సేన్‌తో సహజీవనం.. 3 ఏళ్ల రిలేషన్‌షిప్ బ్రేకప్.. కారణాలివే అంటూ మాజీ ప్రియుడు!

అందం, ఫిట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన విశ్వ సుందరి సుస్మితా సేన్ వయసు 50 ఏళ్లకు చేరువ అవుతున్నప్పటికీ.. ఇంకా పెళ్లికి దూరంగానే ఉంటున్నారు. ప్రేమ, అఫైర్, డేటింగ్ పేరుతో ఆమె లైఫ్‌లోకి ఎంతో మంది వచ్చారనే రూమర్లు మీడియాలో కథనాలుగా వచ్చాయి. కానీ సోషల్ మీడియా యుగంలో మాత్రం తన సహజీవనం స్టోరినీ ఎప్పటికప్పుడు ఇన్స్‌టాగ్రామ్‌లో వెల్లడించే వారు. తన కంటే వయసుల చాలా చిన్నవాడైన ప్రియుడితో రొమాంటిక్ మూమెంట్స్‌ను షేర్ చేసుకొనే వారు. అయితే సుస్మితతో తన అనుబంధాన్ని ఇటీవల ఇంటర్వ్యూలో ఆమె ప్రియుడు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఆయన చెప్పిన విషయాల్లోకి వెళితే..

సుస్మితా సేన్ తాజా మాజీ ప్రియుడు రోహ్మన్ షా. ఔత్సాహిక నటుడైన ఆయన వయసు 34 సంవత్సరాలు. అంటే ఆమె కంటే వయసులో సుమారుగా 16 సంవత్సరాల చిన్నవాడు. కానీ ఇద్దరు అభిరుచులు కలిసి కరోనా సమయం నుంచి వారిద్దరూ కలిసి ఒకే ఇంట్లో జీవించారు. ఆమెతో కలిసి శృంగారపరమైన వర్కవుట్స్ చేయడం లాంటి వీడియోలు, ఫోటోలు వైరల్ కావడంతో వారిద్దరి మధ్య సహజీవనం సాగుతుందనే విషయం బయటకు వచ్చింది.

Sushmita Sen breakup revealed by Ex Boyfriend Rohman Shawl Here is candid talk with Amaran actor

అయితే సుస్మితా సేన్, రోహ్మన్ మధ్య కెమిస్ట్రీ బ్రహ్మండంగా కనిపించింది. 2018 నుంచి 2021 వరకు సుమారుగా మూడేళ్లపాటు కొనసాగింది. వారిద్దరూ సుధీర్ఘకాలం జీవిత ప్రయాణం చేస్తారనే ఫీలింగ్ను అభిమానులకు కలిగించారు. అంతా సవ్యంగానే సాగుతందనే సమయంలో బ్రేకప్ జరిగిందనే వార్త అందర్నీ దిగ్బ్రాంతికి గురి చేసింది.ఇన్స్‌టాగ్రామ్ ద్వారా వారిద్దూ బ్రేకప్ వార్తను అధికారికంగా ధృవీకరించారు. అయితే ఆమెతో ఉన్న తన అనుబంధాన్ని రోహ్మన్ ఇటీవల ఆసక్తికరంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

సుస్మితా సేన్‌తో బ్రేకప్ జరిగినా.. మేమిద్దరం ఇప్పటికే ఫ్రెండ్స్‌గానే ఉన్నాం. మా మధ్య రొమాంటిక్ జీవితం గురించి బాహ్య ప్రపంచానికి చెప్పాల్సిన పని లేదు. మా రిలేషన్‌షిప్ బ్రేకప్ గురించి వివరించాల్సిన అవసరం అంతకన్నా లేదు. మా రిలేషన్ మా ప్రైవేట్ అంశం. పదిమందితో పంచుకోవాల్సిన అవసరం లేదు అని అన్నారు.

సుస్మిత సేన్ ఓ స్నేహితురాలిగా నా కెరీర్‌కు ఎప్పుడూ సపోర్టివ్‌గా ఉన్నారు. నేను ఇటీవల నటించిన అమరన్ సినిమా విషయంలో ఆమెకు అంతా తెలుసు. అమరన్ సినిమా షూట్ జరిగేటప్పుడు ప్రతీ విషయాన్ని ఆమెతో పంచుకొనే వాడిని. ఆమె సలహాలు, సూచనలు నేను పాటించే వాడిని. ఆమె నాకు ఇచ్చిన మోరల్ సపోర్ట్ మరువలేనిది అని అన్నారు.

Sushmita Sen breakup revealed by Ex Boyfriend Rohman Shawl Here is candid talk with Amaran actor

రోహ్మన్ కెరీర విషయానికి వస్తే.. పాపోన్: మౌలా అనే సినిమాతో కెరీర్ ప్రారంభించారు ఆ తర్వాత మై ఫాదర్స్ డాక్టర్ చిత్రంతో ముందుకు వచ్చారు. తాజాగా సాయిపల్లవి, శివకార్తీకేయన్ జంటగా కమల్ హాసన్ నిర్మించిన అమరన్ సినిమాల కీలక పాత్రను పోషించాడు. ఈ సినిమాలో ఆయన నటనకు మంచి మార్కులే పడ్డాయి.

More from Filmibeat

Read more about: sushmita sen rohman shawl amaran
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X