బాయ్ ఫ్రెండ్‌తో సీనియర్ హీరోయిన్ ఎంగేజ్మెంట్.. ప్రియుడి చేయి పట్టుకుని పరిగెడుతూ!
నాలుగు పదుల వయసు దాటినా సుస్మిత సేన్ ఇంకా సింగిల్ గానే ఉంటోంది. సుస్మిత సేన్ కు సింగిల్ లైఫ్ బోర్ కొట్టిందేమో.. గత కొన్ని నెలలుగా సుస్మిత సేన్ ఓ యువ మోడల్ తో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ముంబైకి చెందిన రొహ్మన్ షాల్ అనే మోడల్, సుస్మిత ఘాటు ప్రేమలో మునిగితేలుస్తున్నారు. ఆ విషయాన్ని సుస్మిత సేన్ కూడా చెప్పకనే చెబుతోంది. ఇంస్టాగ్రామ్లో తన ప్రియుడితో కలసి ఉన్న ఫోటోలని సుస్మిత షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రియుడితో రొమాంటిక్‌గా
సుస్మిత సేన్ తాజాగా ఇంస్టాగ్రామ్లో షేర్ చేసిన కొన్ని ఫొటోలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. సుస్మిత, రొహ్మాన్ ఒకరినొకరు కౌగిలించుకుని రొమాంటిక్ ఫోజు ఇచ్చారు. ఇదంతా ఒక ఎత్తైతే సుస్మిత చేతికి ఉన్న ఉంగరం హైలైట్ అయ్యేలా ఈ ఫోటో ఉంది. ఈ ఫోటోని చూసిన నెటిజన్లంతా సుస్మిత రొహ్మన్ లకు ఎంగేజ్మెంట్ జరిగిందనే నిర్ధారణకు వస్తున్నారు. దీనితో సుస్మిత సేన్, రొహ్మాన్ జంటకు శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి.

ఈ ఏడాదే పెళ్లి
రొహ్మన్ షాల్ సుస్మిత కంటే వయసులో చాలా చిన్నవాడు. అయినా వీరి మధ్య ప్రేమ చిగురించింది. రొహ్మాన్ షాల్ సుస్మిత కుటుంబంలో బాగా కలసి పోయాడు. సుస్మిత సేన్ కుమార్తెలతో కూడా రొహ్మాన్ కు మంచి బంధం ఏర్పడింది. వీరిద్దరూ ఈ ఏడాదే వివాహం చేసుకునేందుకు సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎంగేజ్మెంట్ విషయాన్ని సుస్మిత అధికారికంగా ప్రకటించలేదు. తన ప్రేమ విషయాన్ని మాత్రం సుస్మిత సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా చెబుతోంది.

ప్రియుడితో పరిగెడుతూ
ప్రస్తుతం సుస్మిత సేన్, రొహ్మాన్ షాల్ న్యూయార్క్ వెకేషన్ లో ఉన్నారు. రొహ్మన్ చేయి పట్టుకుని పరిగెడుతున్న ఫోటోని సుస్మిత షేర్ చేసింది. నాతో కలసి పరిగెత్తు రొహ్మన్ అంటూ సుస్మిత కామెంట్ పెట్టింది. సుస్మిత సేన్ ప్రస్తుతం సినిమాలకు దూరమైంది. రొహ్మన్ మోడలింగ్ లో రాణిస్తున్నాడు.

ఫ్యాషన్ షోలో
సుస్మిత సేన్ గత ఏడాది ఓ ఫ్యాషన్ షోకు హాజరైన సంధర్భంగా తొలిసారి రొహ్మన్ షాల్ ని కలుసుకుంది. వీరిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరిద్దరూ పలు కార్యక్రమాలకు చెట్టాపట్టాలేసుకుని వెళుతున్నారు. సుస్మిత సేన్ ఇద్దరు పిల్లలని దత్తత తీసుకుని పెంచుతున్న సంగతి తెలిసిందే. సుస్మిత సేన్ ప్రస్తుతం వయసు 43 ఏళ్ళు. ఈ వయసులో సుస్మిత పెళ్లి వార్త ఎప్పుడు వినిపిస్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











