సుస్మితా సేన్‌కు విషాదం.. బాలీవుడ్‌లో మరో సూసైడ్.. అనుమానాస్పదంగా..
మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి సుస్మితాసేన్ విషాదంలో మునిగిపోయారు. ఆమెకు అత్యంత సన్నిహితుడు, కళాకారుడు రామ్ ఇంద్రనీల్ కామత్ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం బాలీవుడ్ ప్రముఖులను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేస్తున్నది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం నుంచి ఇంకా కోలుకోకముందే బాలీవుడ్‌లో మరో సూసైడ్ చోటుచేసుకోవడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కామత్ మరణం గురించి వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ ప్రముఖులకు సన్నిహితుడు
ముంబైకి చెందిన ప్రముఖ పెయింటర్, బాలీవుడ్ ప్రముఖులకు అత్యంత సన్నిహితుడు రామ్ ఇంద్రనీల్ కామత్ మాతుంగ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఆయన ఇంట్లోని బాత్రూం టబ్‌లో అనుమానాస్పద పరిస్థితుల్లో బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మరణించారు. ఆయన బాత్రూంలో పడి ఉండటాన్ని చూసి తల్లి ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించారు.

బాత్రూంలో విగతజీవిగా
బాత్రూంలో విగత జీవిగా పడి ఉన్న రామ్ ఇంద్రనీల్ కామత్‌ను చూసి తల్లి సమాచారం అందించడంతో ఆయనను సమీపంలోని సియాన్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఆయన అప్పటికే మరణించారనే విషయాన్ని వైద్యులు ధృవీకరించారు. ఈ అనుమానాస్పద మరణాన్ని యాక్సిడెంటల్ డెత్‌గా కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై మతుంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కొద్ది రోజులుగా మానసిక వ్యాధితో
గత కొద్దిరోజులుగా కామత్ మానసిక రుగ్మతతో బాధపడుతూ చికిత్స పొందున్నారని సన్నిహితులు వెల్లడించారు. అయితే చికిత్స తర్వాత పూర్తిగా కోలుకొన్నారా అనే విషయంపై క్లారిటీ లేదని పేర్కొంటున్నారు. కామత్ మరణం వెనుక ఏదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు పోస్టు మార్టం నివేదిక కోసం వేచి చూస్తున్నారు.
Recommended Video

మహాలక్ష్మి పుత్రుడినంటూ ..
ప్రముఖ పెయింటర్‌గా గుర్తింపు పొందిన రామ్ ఇంద్రనీల్ కామత్ బాలీవుడ్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తనకు తాను మహాలక్ష్మి పుత్రుడిగా చెప్పుకొంటారు. పురాణ కథల నేపథ్యంతో ఆయన వేసిన క్యాలెండర్లు అంత్యంత ప్రజాదరణ పొందాయి. గ్లాస్ వర్క్ పెయింటర్‌గా, ఫొటోగ్రాఫర్‌గా కామత్ సుపరిచితులు.


Click it and Unblock the Notifications











