For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కూతుళ్ల పక్కనే ప్రియుడితో రొమాన్స్.. సీనియర్ హీరోయిన్ నిర్వాకం!

    |
    Sushmita Sen To Get Married To Her Boyfriend Rohman Shawl??

    నాలుగు పదుల వయసు దాటినా సుస్మిత సేన్ ఇంకా సింగిల్ గానే ఉంటోంది. సుస్మిత సేన్ జీవితంలో పెళ్లి భాజాలు మోగే గడియ ఇంకా రాలేదు. ఆ సందర్భం ఎంతో దూరంలో లేదని బాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా సుస్మిత సేన్ ఓ యువ మోడల్ తో డేటింగ్ లో ఉన్నట్లు బలమైన వార్తలు వస్తున్నాయి. ముంబైకి చెందిన రొహ్మన్ షాల్ అనే మోడల్, సుస్మిత ఘాటు ప్రేమలో మునిగితేలుస్తున్నారట. ఆ విషయాన్ని సుస్మిత సేన్ కూడా చెప్పకనే చెబుతోంది.

    ఫ్యాషన్ షోలో పరిచయం

    ఫ్యాషన్ షోలో పరిచయం

    ఓ ఫ్యాషన్ షోలో భాగంగా సుష్మితకు రొహ్మన్ తో పరిచయం అయినట్లు తెలుస్తోంది. చాలా త్వరగా వీరిద్దరి మనసులు కలవడంతో డేటింగ్ మొదలు పెట్టేశారట. గత కొన్ని నెలలుగా వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అప్పుడప్పుడూ వీరిద్దరూ జంటగా తిరుగుతూ మీడియా కంటబడుతున్నారు.

     ప్రియుడితో హాట్ హాట్ గా

    ప్రియుడితో హాట్ హాట్ గా

    ఇటీవల సుస్మిత తన ప్రియుడితో వ్యాయమ కసరత్తులు చేస్తున్న హాట్ పిక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో ఉన్నది సుస్మిత ప్రియుడే అంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. బాలీవుడ్ లో జరిగిన పలు కార్యక్రమాలకు కూడా వీరిద్దరూ జంటగా హాజరు కావడం హాట్ టాపిక్ గా మారింది.

    కూతుళ్ళ పక్కనే

    కూతుళ్ళ పక్కనే

    సుస్మిత సేన్ ఇద్దరు కుమార్తెలని దత్తత తీసుకుని పెంచుతున్న సంగతి తెలిసిందే. తన నివాసంలో జరిగిన దీపావళి సంబరాలకు సంబందించిన పిక్స్ ని సుస్మిత సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోల్లో సుస్మిత ప్రియుడు రొహ్మన్ కూడా ఉన్నాడు. తన ప్రియుడు రొహ్మన్ ఒడిలో కూర్చుని రొమాన్స్ లో మునిగితేలుతోంది. పక్కనే కుమార్తెలు కూడా ఉన్నారు.

    మ్యారేజ్ ప్రపోజల్

    మ్యారేజ్ ప్రపోజల్

    తాజాగా బాలీవుడ్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఇటీవలే రొహ్మన్ సుస్మిత సేన్ ముందు మ్యారేజ్ ప్రపోజల్ ఉంచినట్లు తెలుస్తోంది. దీనికి సుస్మిత కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ జంట పబ్లిక్ గా తిరుగుతున్నారని అంటున్నారు. త్వరలోనే వీరిద్దరూ వివాహ బంధంతో తమ రిలేషన్ షిప్ ని మరో స్థాయికి తీసుకుని వెళ్లనున్నారు.

    English summary
    Sushmita Sen to get MARRIED to boyfriend Rohman Shawl. Sushmita Sen’s Diwali celebrations with beau Rohman Shawl
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X