42 ఏళ్ల వయసులో సుస్మిత సేన్ పెళ్లి.. వరుడు ఎవరంటే..
మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ ఇన్నాళ్లకు పెళ్లి చేసుకోబోతోందా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. 2017 సంవత్సరం నుంచి ఆమె రొహమన్ షాల్ అనే ఈ యువ మోడల్‌తో డేటింగ్ చేస్తోంది. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ ఇద్దరి విహాహానికి రంగం సిద్ధమైందని తెలుస్తోంది. ఇంతకీ సుస్మిత పెళ్లెప్పుడు? వివరాల్లోకి పోతే..

సినీ రంగం.. బ్రేక్
భారతీయ చలన చిత్ర రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది సుస్మితా సేన్. ఎన్నో సినిమాలో అందంతో పాటు అభినయంతో ఆకట్టుకుంటూనే ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది. అయితే, కొద్ది సంవత్సరాలుగా మాత్రం తన కెరీర్‌కు బ్రేక్ ఇచ్చింది. 2015లో ‘నిర్బాక్' అనే బెంగాళీ ఫిల్మ్ తర్వాత ఆమె మరోసారి నటించలేదు.

15 ఏళ్ళు చిన్నవాడితో డేటింగ్
ప్రస్తుతం 42 ఏళ్ల వయసున్న సుస్మితా సేన్.. తనకన్నా 15 ఏళ్ళు చిన్నవాడైన రొహమన్ షాల్ అనే యువకుడితో డేటింగ్ చేస్తోంది. అయితే పిల్లలపై మమకారంతో రాణీ, అలీషా అనే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుంది. అయితే ప్రియుడు, పిల్లలతో కలిసి ఈ మధ్య తెగ షికార్లు చేస్తోంది సుస్మితా సేన్. దీంతో ఈమె పెళ్లిపై పుకార్లు పుట్టుకొచ్చాయి.
2019 చివర్లో సుస్మితా పెళ్లి
రెండేళ్లుగా ప్రియుడు రొహమన్ షాల్‌తో చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్న సుస్మిత సేన్ 2019 చివర్లో పెళ్లి పీటలెక్కనుందని సమాచారం అందుతోంది. 2019 నవంబర్ లేదా డిసెంబర్ నెలలో ఈ ఇద్దరి మ్యారేజ్ జరగనుందట. పైగా ఈ పెళ్లికి సుష్మిత పిల్లలు కూడా అంగీకారం తెలిపారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

సోషల్ మీడియా సుస్మిత సేన్ గురించి
సామాజిక మాధ్యమాల్లో యమ యాక్టివ్‌గా ఉండే సుస్మితా సేన్.. తరచూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఓ ఫోటో చర్చనీయాంశం అవుతోంది. ఈ పిక్‌లో సుస్మితను రొహమన్ కిస్ చేస్తున్నాడు. దీన్ని ఆమె సెల్ఫీ తీసి షేర్ చేసింది సుస్మిత. దీంతో వీరి పెళ్లి కన్ఫర్మ్ అని భావిస్తున్నారు జనం.


Click it and Unblock the Notifications











