Don't Miss!
- News ఉండి టీడీపీలో వార్ - మారుతున్న లెక్కలు, ఆడియో వైరల్..!!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్‌కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ప్రియుడితో సరసాలు, రొమాంటిక్ ఫోటోస్ షేర్ చేసిన హీరోయిన్!
బాలీవుడ్ నటి సుష్మితా సేన్ మోడల్ రోహ్మాన్ షాల్‌తో కొన్ని రోజులుగా లవ్ రిలేషన్ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అతడితో కలిసి సహజీవనం చేస్తున్న ఈ మాజీ విశ్వసుందరి... తమ 'సం' బంధాన్ని ప్రజలకు, అభిమానులకు తెలిసేలా ఎలాంటి మొహమాటం లేకుండా ప్రదర్శిస్తుంటారు. తమ మధ్య ప్రేమ బంధం, సాన్నిహిత్యం ఎంత బలంగా ఉందో వెల్లడిస్తూ తరచూ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు. ఈ జంట ప్రస్తుతం మాల్దీవుల్లో విహారయాత్రలో ఉన్నారు. ఈ సందర్భంగా కొన్ని రొమాంటిక్ ఫోటోలను ఆమె అభిమానులతో పంచుకున్నారు.
పిక్చర్ పర్ఫెక్ట్
సుష్మితా సేన్, ఆమె బాయ్ ఫ్రెండ్ రోహ్మాన్ షాల్ బోట్ రైడింగ్ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు ఇక్కడ చూడొచ్చు. ఈ ఫోటో చూసిన అభిమానులు పిక్చర్ పర్ఫెక్ట్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఇద్దరి మధ్య సంబంధాన్ని విమర్శించే వారు లేకపోలేదు.
ప్రేమలో మునిగి తేలడం అంటే ఇదేనా?
ప్రియుడి ఒడిలో తలపెట్టి సముద్రపు చల్లగాలులను ఎంజాయ్ చేస్తున్న సుష్మితా సేన్. ప్రతి ఒక్కరూ తమ రొమాంటిక్ జీవితంలో ఇలాంటి మూమెంట్ ఒక్కసారైనా ఉండాలని కోరుకుంటారు. ప్రేమలో మునిగితేలడం అంటే బహుషా ఇదేనేమో?
లవ్లీ కాప్షన్ పెట్టిన సుష్మిత
ఈ ఫోటోకు కిస్ ఎమోజీతో '#LOVE' అంటూ క్యాప్షన్ పెట్టింది సుష్మిత సేన్. ఈ ఫోటోపై ఆమె ప్రియుడు రొహ్మాన్ షాల్ రియాక్ట్ అవుతూ "Bliss(ఆనందం)" అంటూ కామెంట్ పోస్ట్ చేశాడు. వీరి మధ్య ఉప్పొంగుతున్న లవ్ రిలేషన్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.
ఫీనిక్స్ పక్షిలా విహరిస్తూ..
ఫీనిక్స్ పక్షి నుంచి స్పూర్తి పొందాలి అనే కాప్షన్‌తో సుష్మిత మరో ఫోటో షేర్ చేశారు. ప్రాచీన గ్రీకు పురాణాల ప్రకారం ఫీనిక్స్ అనేది పునర్జీవితాన్ని తీసుకొగలిగే ఒక కాల్పనిక పక్షి. సూర్యునితొ సన్నిహిత సంబంధం ఉన్న ఈ పక్షి, తన పూర్వీకుల బూడిద నుంచి కొత్త జీవితాన్ని పొందుతుంది.
పెళ్లి చేసుకుంటారా?
42 ఏళ్ల వయసున్న సుస్మితా సేన్.. తనకన్నా 15 ఏళ్ళు చిన్నవాడైన రోహ్మాన్ షాల్ డేటింగ్ చేస్తోంది. తను దత్తత తీసుకుని పెంచుకుంటున్న కూతుర్లు రాణి, అలీషాతో కూడా రోహ్మాన్ షాల్ కలిసి పోవడంతో ఇతడినే తన జీవిత భాగస్వామి చేసుకునే ఆలోచనలో ఉందనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి.