twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోయిన్‌ని వేధించిన ఉద్యోగి.. 15 ఏళ్లుగా మాజీ ప్రపంచ సుందరి, ఎట్టకేలకు అనుకూలంగా!

    |

    మాజీ ప్రపంచ సుందరి సుస్మిత సేన్, కోకోకోలా సంస్థ మధ్య 15 ఏళ్లుగా కేసులు కొనసాగుతున్నాయి. 2003 లో కొలొకోలా బ్రాండ్ కు సుస్మిత సేన్ ఎండార్స్ మెంట్ చేసింది. ఆ సమయంలో జరిగిన ఓ ఘటన దేశం మొత్తం హాట్ టాపిక్ గా మారింది. ఆ కేసులో తాజాగా సుస్మిత సేన్ కు పూర్తిగా సమస్యలు తొలగిపోయాయి. లైంగిక వేధింపులపై ఇప్పుడు మీ టూ పేరుతో పెద్ద ఉద్యమమే చేస్తున్నారు. ఈ తరహా వేధింపులని 15 ఏళ్ల క్రితమే సుస్మిత ఎదుర్కొంది. ఈ కేసులో కోర్టు తాజా తీర్పు సుస్మితాసేన్ కు అనుకూలంగా ఉంది.

    కోకోకోలా సంస్థలో

    కోకోకోలా సంస్థలో

    కోకోకోలా సంస్థలో ఉన్నతస్థానంలో ఉన్న ఉద్యోగి తనని లైంగికంగా వేధించాడు అంటూ సుస్మిత కేసు నమోదు చేసింది. ఆ సమయంలో సుస్మిత సేన్ కోకోకోలా సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేది. ఈ కేసులో సుదీర్ఘంగా న్యాయపోరాటం చేసిన సుస్మిత చివరకు నెగ్గింది. సుస్మితకు 1.45 కోట్ల నష్టపరిహారం చెల్లించాలి అని కోర్టు ఆదేశించడంతో ఆ మొత్తాన్ని సుస్మిత పొందింది.

     ఆదాయపు పన్ను కేసు

    ఆదాయపు పన్ను కేసు

    ఒక్కసారిగా సుస్మిత కోకోకోలా సంస్థ నుంచి 1.45 కోట్లు ఆదాయం పొందడంతో పన్ను చెల్లించాలని ఆదాయపు శాఖ అధికారులు ఆదేశించారు. కానీ సుస్మిత సేన్ పన్ను చెల్లించలేదు. 1.45 కోట్లలో అధికారులు 50 లక్షలు ఆదాయపు పన్నుగా పరిగణించారు. సుస్మిత సేన్ గడువు ముగిసినా పన్ను చెల్లించకపోవడంతో మరో 35 లక్షలు పెనాల్టీ విధించారు.

    అది ఆదాయమే కాదు

    అది ఆదాయమే కాదు

    ఈ నేపథ్యంలో సుస్మిత సేన్ కోర్టుని ఆశ్రయించింది. తాజాగా కోర్టు సుస్మితకు అనుకూలంగా తీర్పు నిచ్చింది. నష్టపరిహారంగా పొందిన మొత్తాన్ని ఆదాయంగా పరిగణించలేం. కాబట్టి సుస్మిత సేన్ పన్ను చెల్లించనవసరం లేదు అంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. దీనితో 2003 లో ప్రారంభమైన ఈ ఎపిసోడ్ కు ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పడింది.

    బాయ్ ఫ్రెండ్‌తో కొత్త జీవితం

    బాయ్ ఫ్రెండ్‌తో కొత్త జీవితం

    ఈ 42 ఏళ్ల ముదురు సుందరి ప్రస్తుతం ఓ కుర్ర మోడల్ తో ప్రేమలో మునిగి తేలుతోంది. త్వరలో వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. సుస్మిత సేన్ సహజీవనం చేస్తున్న ప్రియుడి పేరు రొహ్మన్ షాల్. యువ మోడల్ గా రాణిస్తున్న అతడు ఓ ఈవెంట్ లో సుస్మితని కలుసుకుని ఆమె ప్రేమలో పడ్డాడు. సుస్మిత సేన్ ఇంతవరకు వివాహం చేసుకోలేదు. కానీ ఇద్దరు పిల్లలని దత్తత తీసుకుని పెంచుతోంది.

    English summary
    Sushmita Sen Not Needed To Pay Tax On Coca Cola's MeToo Payout. The case pertains to a Rs. 1.50 crore contract between Coca Cola and Sushmita Sen which was ended prematurely in 2003
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X