For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Sushmita Sen: ఐపీఎల్ ఆర్థిక నేరస్తుడితో డేటింగ్.. పెళ్లి కాలేదు కానీ ఫుల్ హ్యాపీ అంటూ..

  |

  సినిమా ప్రపంచంలో చాలామంది హీరోయిన్స్ బిజినెస్ మెన్స్ ను వివాహం చేసుకోవడం ఆ తర్వాత బ్రేకప్ చెప్పడం కామన్ గానే మారుతుంది. కొంతమంది మాత్రం వారు పాట్నర్స్ ను ఎంచుకునే విధానం కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. రీసెంట్ గా మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ ఎన్నో ఆర్థిక నేరాల్లో పేరుగాంచిన వ్యక్తితో ప్రేమను కొనసాగించడం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక వారిద్దరికీ పెళ్లి జరిగిపోయింది అని ఇటీవల వార్తలు కూడా వచ్చాయి. ఈ కామె రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక వివరణ అయితే ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

  మిస్ యూనివర్స్

  మిస్ యూనివర్స్

  మోడలింగ్ ప్రపంచంలో 90ల కాలంలో మంచి గుర్తింపును అందుకున్న సుస్మితా సేన్ 1994లో నిర్వహించిన మిస్ యూనివర్స్ పోటీల్లో విజేతగా నిలిచింది. అంతకుముందే మిస్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకున్న ఈ బ్యూటీ అప్పట్లో 18 ఏళ్లకే ప్రపంచ సుందరిగా క్రేజ్ అందుకోవడం ఒక రికార్డు అనే చెప్పాలి. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా చాలా బిజీగా మారిపోయింది.

  బాలీవుడ్ స్టార్ ఇమేజ్

  బాలీవుడ్ స్టార్ ఇమేజ్

  సుస్మితా సేన్ సినిమా వస్తుంది అంటే అప్పట్లో యువత ఆమె సినిమాను చూసేందుకు ఎంతగానో ఎగబడి చూసేవారు. 1994 నుంచి 2005 వరకు కూడా ఆమె స్టార్ ఇమేజ్ ను కొనసాగించింది. దాదాపు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోలందరితో ఆమె స్క్రీన్ షేర్ చేసుకుంది. అంతటి స్టార్ హీరో ఇమేజ్ అందుకున్న ఆమె ప్రేమలో చేదు అనుభవాలను కూడా ఎదుర్కొంది.

  రెండుసార్లు బ్రేకప్

  రెండుసార్లు బ్రేకప్

  రెండు ప్రేమలో విఫలమైనప్పటికీ కూడా సుష్మితాసేన్ ఇద్దరు పిల్లలను దత్తత తీసుకొని చాలామందికి స్ఫూర్తినిచ్చింది. అందులో ఒకమ్మాయి బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి కూడా సిద్ధమవుతోంది. పర్సనల్ లైఫ్ లో ఎలాంటి చేదు అనుభవాలని ఎదుర్కొన్నప్పటి తనకంటే చిన్న వారితో కూడా ఆమె ప్రేమలో మునిగి తేలింది.

  లలిత్ మోడీ ఎవరంటే..

  లలిత్ మోడీ ఎవరంటే..

  ఇక ఇప్పుడు సుస్మితాసేన్ ఇండియాలో ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొన్న లలిత్ మోడీతో డేటింగ్ చేస్తున్నట్లుగా వివరణ ఇవ్వడం విశేషం. ఐపీఎల్ ను స్థాపించిన లలిత్ మోడీ అప్పట్లో వేల కోట్ల ఆదాయాన్ని అందుకున్నాడు. అయితే బీసీసీఐలో కొన్ని అవకతవకాలు చేయడంతో అతనిపై పలు కేసులు నమోదు అయ్యాయి. అంతే కాకుండా అతను అక్రమంగా చాలా డబ్బులు సంపాదించుకున్నట్లు కూడా కొన్ని కేసులు నమోదవడంతో లండన్ పారిపోయాడు.

  క్లారిటీ ఇచ్చిన లలిత్ మోడీ

  క్లారిటీ ఇచ్చిన లలిత్ మోడీ

  నీరవ్ మోడీ, విజయ్ మాల్యా తరహాలో లండన్ లో తలదాచుకుంటున్న లలిత్ మోడీ ఇండియా వస్తే మాత్రం జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఇక అలాంటి వ్యక్తితో సుస్మితాసేన్ డేటింగ్ లో ఉంది అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. సుస్మిత సిన్ కంటే ముందుగానే లలిత్ మోడీ ప్రేమలో ఉన్నట్లు క్లారిటీ ఇచ్చాడు. అయితే ఇంకా పెళ్లి మాత్రం కాలేదు అని అన్నారు.

  స్పందించిన సుస్మితా

  స్పందించిన సుస్మితా

  ఇక సుస్మితా కూడా ఫైనల్ గా ఒక వివరణ ఇచ్చింది. నాకు ఇష్టమైన చోట ఇష్టమైన వ్యక్తులతో ఉన్నాను. చాలా ప్రేమలో ఉన్నాను. కానీ పెళ్లి అయితే కాలేదు. అలాగే ఉంగరాలు కూడా మార్చుకోలేదు. ఈ క్లారిటీ సరిపోతుంది అనుకుంటున్నాను. ఇక నా పని నేను చూసుకుంటాను. ఎవరైతే నా హ్యాపీనెస్ ను షేర్ చేసుకుంటున్నారో వారికి కృతజ్ఞతలు. ఇక షేర్ చేసుకొని వారి గురించి అవసరం లేదు. ఇక అందరికి లవ్ యూ.. అని సుస్మిత కొన్ని ఫొటోలతో సోషల్ మీడియాలో ఈ విధంగా వివరణ ఇచ్చింది.

  English summary
  Sushmita Sen react on marriage news with lalit modi and dating relationship
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X