షాకింగ్.. సుస్మితా సేన్‌కు గుండెపోటు.. స్టెంట్ వేసిన వైద్యులు.. ఇప్పుడు ఎలా ఉందంటే?
మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కింగ్ నాగార్జున రక్షకుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అంతేకాకుండా ఓటీటీలో ఆర్య వెబ్ సిరీస్ తో మంచి పేరు తెచ్చుకుంది ఈ సీనియర్ హీరోయిన్. అయితే తాజాగా సుస్మితా సేన్ తన అభిమానులకు, ప్రేక్షకులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. ఆమె రెండు రోజుల క్రితం గుండెపోటుకు గురయ్యానంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టి షాక్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్ నటి, మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ తన అభిమానులకు, సినీ ప్రేక్షకులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. తాను రెండు రోజుల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఆమెకు రెండు రోజులకు ముందు గుండెపోటు వచ్చినట్లు స్వయంగా సుస్మితా సేన్ ఈ విషయాన్ని వెల్లడించింది. "మీ గుండెను ధైర్యంగా సంతోషంగా ఉంచుకోండి. అది మీకు అవసరమైన సమయంలో ఉపయోగపడుతుంది" అని తన తండ్రి చెప్పిన మాటలను గుర్తు చేసుకున్న సుస్మితా సేన్ ఆమెకు హార్ట్ ఎటాక్ వచ్చినట్లు తెలిపింది.

"కొద్ది రోజుల క్రితం నాకు గుండెపోటు వచ్చింది. యాంజియోప్లాస్టీ చేసి గుండెలో స్టెంట్ వేశారు. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే నా గుండె చాలా గట్టిదని వైద్యులు మరోసారి తేల్చి చెప్పారు. ఇప్పుడు నా ఆరోగ్యం బాగుందన్న గుడ్ న్యూస్ తో నా అభిమానులు, శ్రేయోభిలాషులకు తెలియజేసేందుకే ఈ పోస్ట్ పెట్టాను" అని రాసుకొచ్చింది సుస్మితా సేన్. దీంతో ఆమె అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆమె ఆరోగ్యంపై ఆరా తీయడమే కాకుండా బాలీవుడ్ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సుస్మితా సేన్ కు గుండెపోటు వచ్చిందన్న వార్త బాలీవుడ్ మీడియాలో ఎందుకు రాలేదని ఆమె ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇదిలా ఉంటే గుండెపోటు వచ్చినప్పుడు రక్తం గడ్డకట్టడి ధమనులు పని చేయకుండా ఆగిపోతాయి. గుండెకు రక్త ప్రవాహం నిరోధించబడటంతో చెస్ట్ లో నొప్పి కలుగుతుంది. దీన్ని యాంజినా అని అంటారు. ఇది తరచుగా శారీరక శ్రమ, ఒత్తిడి కారణంగా కూడా జరుగుతుంది. యాంజినాను మందుల ద్వారా నయం చేసినప్పటికీ గుండెపోటు తర్వాత యాంజియోప్లాస్టీని అత్యవసర చికిత్సగా ఉపయోగిస్తారు.


Click it and Unblock the Notifications











