twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గృహ నిర్బంధంలో ప్రియుడితో సుస్మిత శృంగార ఆసనాలు.. లాక్‌డౌన్‌లో దిమ్మతిరిగే విన్యాసాలు!

    |

    కరోనా లాక్‌డౌన్‌ను మాజీ ప్రపంచ సుందరి సుస్మిత సేన్ ఎంజాయ్ చేస్తున్నారు. గృహ నిర్బంధంలో ప్రియుడు రోహ్మన్ షా, తన పెంపుడు కూతుళ్లు రెనీ, ఐలాష్‌తో గడుపుతున్నారు. లాక్‌డౌన్ పిరియడ్‌లో గడుపుతున్న క్షణాలను, యోగాసనాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆసక్తి రేపుతున్న ఆ ఫోటోలు మీ కోసం..

    యోగాసనాలతో ఆరోగ్యంగా

    యోగాసనాలతో ఆరోగ్యంగా

    యోగాసనాలు క్రమం తప్పకుండా వేసే బాలీవుడ్ తారల్లో సుస్మితా సేన్ ఒకరు. చాలా కష్టమైన ఆసనాలను వేస్తూ ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడుకొంటున్నారు. గతంలో సుస్మిత వేసిన యోగాసనాలు అభిమానులు, సన్నిహితులను విశేషంగా ఆకట్టుకొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ కష్టమైన ఆసనాన్ని వేయమని తన ప్రియుడు రోహన్‌ తనకు సవాల్ విసిరాడనే విషయాన్ని వెల్లడించింది.

    నా బాయ్‌ఫ్రెండ్ విసిరిన ఛాలెంజ్

    నా బాయ్‌ఫ్రెండ్ రోహన్ సవాల్‌పై సుస్మిత తన ఇన్స్‌టాగ్రామ్‌లో స్పందిస్తూ.. రోహన్ నన్ను ఛాలెంజ్ చేశాడు. కష్టతరమైన యోగా ఫోజును బ్యాలెన్స్ చేయమని సవాల్ విసిరారు. అయితే ఆ ఫోజును ఇలా ట్రై చేశాను. మీకు కూడా ఇలా చేసి విజయం సాధించండి అంటూ సుస్మితా సేన్ పేర్కొన్నారు.

    నేను విసురుకొన్న ఛాలెంజ్ ఇది..

    అలాగే యోగాలో భాగంగా తన కాలి పాదంపై మరో కాలును పెట్టి బ్యాలెన్స్ చేస్తూ ఓ కష్టమైన యోగాసనాన్ని వేశారు. ఇది ఎవరో విసిరిన ఛాలెంజ్ కాదు. నాకు నేను విసురుకొన్న ఛాలెంజ్ ఇది. పాదం మొనలపై బాడీని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. అలా కంట్రోల్ చేయడంలో నేను సక్సెస్ అని సుస్మితా సేన్ అన్నారు.

    సుస్మిత సేన్ ప్రియుడి స్పందన

    సుస్మిత సేన్ కామెంట్లపై ప్రియుడు రోహన్ షా స్పందిస్తూ.. నా గర్ల్‌ఫ్రెండ్ అన్ని విషయాల్లో నాకు ఇన్సిపిరేషన్. ఇలాంటి ఫోజును చేయడానికి ప్రయత్నిస్తే మూతి పగలింది. నాకు యోగాసనం చాలా కష్టంగా మారింది. అందుకే నీవంటే నాకు అన్ని విషయాల్లో స్ఫూర్తి అని రోహన్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో పేర్కొన్నారు.

    Recommended Video

    HIT Movie Opening Ceremony || Nani || Vishwak Sen ||
    సుస్మిత కెరీర్ గురించి

    సుస్మిత కెరీర్ గురించి

    ఇక సుస్మిత సేన్ కెరీర్ విషయానికి వస్తే.. గత పదేళ్లలో పెద్దగా నటించిన దాఖలాలు లేవు. 2010 నుంచి చూస్తే కేవలం నాలుగు సినిమాల్లోనే నటించింది. దుల్హా మిల్ గయా, నో ప్రాబ్లెం, నిర్బక్, హ్యాపీ యానివర్సరీ చిత్రాల్లో మాత్రమే కనిపించింది. ప్రస్తుతం డిస్నీ, హాట్‌స్టార్ కాంబినేషన్‌లో వస్తు్న ఆర్య సిరీస్‌లో నటిస్తున్నది.

    English summary
    Former Miss Universe, Actress Sushmita Sen romantic Yogasanas with Rohman Shawl in Lockdown. She shared that, So rohmanshawl challenged me to attempt this balancing #yogapose 😉😁❤️ Guess who’s always up for a challenge!!😉👊 #yourstruly of course!! wanna try? You can do it!!!👊👍😍 I love you guys!!!💃🏻 hint: straighten your back & tighten your core 👍😉
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X