ప్రియుడితో హీరోయిన్ రొమాంటిక్‌గా.. ఒడిలో ఒదిగిన స్టార్ ఎవరో తెలుసా?
నాలుగు పదుల వయసులోనూ డేటింగ్, అఫైర్లతో విశ్వసుందరి సుస్మిత సేన్ హడావిడి చేస్తున్నది. గత కొద్దిరోజులుగా తన ప్రియుడు రోహ్మన్ షాల్‌తో డేటింగ్ చేస్తూ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా మారింది. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ కథనాలు కూడా వస్తున్నాయి. అందుకు బలంగా మారే విధంగా సుస్మిత, రోహ్మన వ్యవహారం మీడియాలో చర్చనీయాంశమైంది. సుస్మిత పుట్టిన రోజున రోహ్మాన్ ఎలాంటి గిఫ్ట్ ఇచ్చారంటే..
Recommended Video


సుస్మిత, రోహ్మన్ మధ్య కెమిస్ట్రీ
సుస్మిత, రోహ్మన్ మధ్య కెమిస్ట్రీ చూస్తే వారిద్దరి మధ్య బలమైన బంధం ఉన్నట్టు కనిపిస్తున్నది. వారిద్దరూ ఇప్పటి వరకు తమ బంధాన్ని బయటపెట్టడం లేదు. కానీ చాటుమాటుగా జోరుగా రొమాన్స్ చేస్తున్నారు.

మీడియాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా
సుస్మిత, రోహ్మన్ కలిసి పలు చోట్ల విపరీతంగా కనిపిస్తున్నారు. మీడియాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారారు. శిల్పాశెట్టి ఇచ్చిన దీపావళీ విందుకు కలిసి హాజరయ్యారు. రోహ్మన్‌తో కలిసి సుస్మిత తన జీవితాన్ని పంచుకోవాలనుకొంటున్నదనే మాట వినిపిస్తున్నది.

43వ పుట్టిన రోజున
ఇలాంటి కథనాల నేపథ్యంలో నవంబర్ 19వ తేదీ సుస్మిత సేన్ 43వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా రొమాంటిక్ కిస్ ఇచ్చేశాడు. ఒడిలోకి రాగా తలపై ముద్దుపెట్టుకొన్నాడు. ఆ ఫొటోను తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.

నా ప్రియురాలి పుట్టిన రోజున
నవంబర్ 19 తేదీన బర్త్ డే ఎవరిదనుకొంటున్నారు. నా ప్రాణాతి ప్రాణమైన ప్రేయసి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె కోసం విలువైన మాటలను చెప్పాలనుకొన్నాను. ఈ సంవత్సరం జీవితంలో మరిచిపోలేని విధంగా ఉండాలని కోరుకొంటున్నాను. ఐ లవ్ యూ.. ఎప్పటికీ నీ ప్రేమలోనే అని రోహ్మన్ తన సందేశంలో పేర్కొన్నారు.

వచ్చే ఏడాది వివాహం
మీడియాలో కథనాల ప్రకారం.. రోహ్మన్, సుస్మిత సేన్ వచ్చే ఏడాదిలో పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలిసింది. వీరి పెళ్లికి సుస్మిత పెంపుడు కూతుళ్లు ఇద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. అయితే పెళ్లి వార్తలను సుస్మిత ఖండించడం గమనార్హం.


Click it and Unblock the Notifications











