ఆ స్టార్ హీరో అంటే నాకు చాలా ఇష్టం.. సుస్మిత సేన్ కూతురు మనసులో మాట
మాజీ విశ్వ సుందరి, సినీ నటి సుస్మిత సేన్ పెంపుడు కూతురు రెనీ సేన్ తల్లి అడుగు జాడల్లో నడించేందుకు సిద్దమైంది. యాక్టింగ్ కెరీర్‌ను ఎంచుకొన్న రెనీ సేన్ తాజాగా సట్టాబాజీ అనే షార్ట్ ఫిలింలో నటించింది. ప్రస్తుతం ఆ ఫిలింను బాంద్రా ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ షారుక్ ఖాన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.
షారుక్ ఖాన్ గురించి చెబుతూ.. బాలీవుడ్‌లో సూపర్ స్టార్ అయినప్పటికి.. చాలా అనుకువగా ఉంటారు. అతడి మాట, ప్రవర్తన చాలా ఉన్నతంగా ఉంటాయి. తన తల్లి కూడా అలాంటి ధోరణితోనే ఉంటుంది. నిజ జీవితంలో కూడా స్పూర్తి దాయకంగా ఉండటం వల్లే వారికి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఐ లవ్ షారుక్ ఖాన్ సార్. అతడి ఎక్కడ ఉంటే అక్కడే ఓ తేజస్సు ఉంటుంది అని రెనీ సేన్ అన్నారు.

హీరోయిన్ల విషయానికి వస్తే.. ప్రియాంక చోప్రా అంటే నాకు చాలా ఇష్టం. ఆమెను నేను చాలా ఆరాధిస్తాను. ఇండిపెండెంట్ ఉమెన్. మానసికంగా చాలా బలంగా కనిపిస్తారు. అందుకే ఆమెకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. అలాంటి వ్యక్తులను కలవడం నా పూర్వ జన్మసుకృతం అని రెనీ సేన్ అన్నారు.
సట్టాబాజీ షార్ట్ ఫిలిం డిస్నీ+హాట్ స్టార్‌లో రిలీజ్ అయింది. ఈ చిత్రానికి కబీర్ ఖురానా దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో స్వతంత్ర భావాలు ఉన్న యువతిగా రెనీ సేన్ కనిపించింది. ఆమె నటనకు మంచి ప్రశంసలు లభిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











