వెండితెరపైకి మరో సీనియర్ హీరోయిన్ కూతురు.. మొదటి సినిమాలోనే పవర్ఫుల్ రోల్

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కేవలం అబ్బాయిలే కాకుండా అమ్మాయిలు కూడా నటవారసత్వాన్ని మోసేందుకు సిద్ధమవుతున్నారు. ఒకప్పుడు అమ్మాయిలను ఇండస్ట్రీలోకి పెద్దగా పంపించే వారు కాదు. కానీ ఇపుడు వాళ్ళు ఎందుకు రాకూడదు అనే ప్రశ్న బలంగా మారడంతో అక్కడ కూడా సమన్యాయం జరుగుతోంది. ఇక ఎంత బ్యాక్ గ్రౌండ్ తో వచ్చినా కూడా చివరకు ఆడియెన్స్ దృష్టిలో పడ్డవారే మంచి క్రేజ్ అందుకుంటున్నారు.

 సుష్మితా సేన్ కుమార్తె వెండితెర ఎంట్రీ

సుష్మితా సేన్ కుమార్తె వెండితెర ఎంట్రీ

ఇక మాజీ మిస్ యూనివర్స్ సుష్మితా సేన్ కుమార్తె రెనీ సేన్ కూడా త్వరలోనే వెండితెరపైకి రానున్నట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా శిక్షణ తీసుకుంటున్న ఆమె పూర్తిగా తన యాక్టింగ్ కెరీర్ కోసం సిద్ధమైందట. 21 ఏళ్ల రెనీ సుత్తాబాజీ అనే సినిమాతో నటిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. సాంప్రదాయిక కుటుంబంలో తన తల్లితో నిరంతరం పోటీ పడుతు వార్తల్లో నిలుస్తున్న రెనీ ఒక పవర్ఫుల్ డాటర్ గా జనాలను ఆకట్టుకుంటోంది.

పవర్ఫుల్ పాత్రలో రెనీ సేన్

పవర్ఫుల్ పాత్రలో రెనీ సేన్

ఇక ఆమె మొదటి సినిమాలోనే మహిళా సాధికారత అనే పాయింట్ హైలెట్ గా ఉంటుందట. అందులో రెనీ స్వభావానికి తగ్గట్టుగా చాలా పవర్ఫుల్ పాత్ర పోషిస్తోందట. పద్మావత్, శకుంతల దేవి ఫేమ్ కోమల్ చాబ్రియా రెనీ తల్లిగా నటిస్తుండగా రాహుల్ వోహ్రా ఆమె తండ్రిగా కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ ఆదివారం ప్రారంభమైంది. మెయిన్ గా ఈ సినిమా డిజిటల్ విడుదలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

 దత్తపుత్రిక అని చాలా మందికి తెలియదు.

దత్తపుత్రిక అని చాలా మందికి తెలియదు.

ఇక రెనీ సుష్మిత విషయానికి వస్తే.. ఆమె దత్తపుత్రిక అని చాలా మందికి తెలియదు. అవివాహితురాలైన సుష్మిత 2000 సంవత్సరంలో రెనీని, 2010 లో మరో అమ్మాయి అలీసాను దత్తత తీసుకుంది. అప్పటి నుంచి వారి బాగోగులు చూసుకుంటూ ఎంతో మందికి ప్రేరణగా నిలిచింది. ఇక ఫైనల్ గా వారికి ఇష్టమైన సినిమా ప్రపంచంలోకి హ్యాపీగా వెల్కమ్ చెబుతోంది.

Recommended Video

Sushmita Sen Stunning Workouts With Boyfriend Rohman Shawl During Lockdown
మోడల్ తో సుష్మిత డేటింగ్

మోడల్ తో సుష్మిత డేటింగ్

ఇక సుష్మిత పెళ్లిపై గత కొన్నేళ్లుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ఫ్యాషన్ మోడల్ రోహ్మాన్ షాల్‌తో సుష్మిత గత కొంత కాలంగా డేటింగ్ చేస్తున్నట్లు బాలీవుడ్ మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఇక ఇప్పటికే ఈ జంటకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. ఇక సుష్మితా సేన్ ఇటీవల డిజిటల్ వరల్డ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చి ఒక వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X