బ్రేకప్ రూమర్లకు చెక్ చెప్పిన సుస్మితా సేన్.. ప్రియుడితో కలిసి హల్‌చల్
గత రెండు రోజులుగా మాజీ మిస్ యూనివర్స్ సుస్మిత సేన్ తన ప్రియుడితో బ్రేకప్ చేసుకొన్నదనే వార్త బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. గత రెండేళ్లుగా సాగుతున్న ప్రేమ కథకు తెర పడిందనే వార్తలకు సుస్మిత చెక్ చెప్పింది. తమ రిలేషన్‌షిప్ బ్రేకప్ అయిందనే వార్త అవాస్తమం. అందులో ఎలాంటి నిజం లేదు. ఆ వార్తలన్నీ రూమర్లే అంటూ సుస్మిత సేన్ క్లారిటీ ఇచ్చారు. తన ప్రియుడు రోహ్మన్ షాతో కలిసి ఉన్న ఫోటోను తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశారు.

గత రెండు రోజుల క్రితం ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు నర్మగర్భంగా ఓ పోస్ట్ పెట్టి.. మగాళ్లు మారుతామనుకొంటాం కానీ.. వాళ్లు అసలే మారరు. మేము ఎన్ని తప్పులు చేసిన మహిళలు వదిలి పెట్టరనే ఓ అభిప్రాయంతో ఉంటారు అంటూ సుస్మిత సేన్ తన పోస్టులో పేర్కొన్నారు.
వాలంటైన్ డే సెలబ్రేషన్‌లో భాగంగా ముంబై సిటీలో సుస్మితా, రోహ్మన్ షా ఇద్దరు చెట్టాపట్టాలేసుకొని తిరగడం మీడియా కంటికి చిక్కింది. ఒకరికొకరు కౌగిలించుకొంటూ సంతోషంలో మునిగి తేలుతూ కనిపించారు. దాంతో సుస్మిత సేన్ బ్రేకప్ వార్త రూమరే అని తేలిపోయింది.


Click it and Unblock the Notifications











