హృతిక్ భార్యతో సీక్రెట్‌గా అర్జున్ రాంపాల్.. అదే కొంపముంచింది!

By Rajababu

Recommended Video

వివాదాస్పదంగా మారిన అర్జున్ రామ్ పాల్,సుహానే రహస్య సంబంధం

బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్ తన 20 ఏళ్ల దాంపత్య జీవితానికి ముగింపు పలకబోతున్నాడు. భార్య మెహర్ జెస్సియాతో విభేదాలు కారణంగా వేర్వేరుగా నివసిస్తున్న వీరు విడాకుల కోసం దరఖాస్తు చేసుకొన్నారు. వీరి కాపురంలో కలతలు నెలకొనడానికి కారణం హృతిక్ భార్య సుసానే ఖాన్ అనే మాట వినిపిస్తున్నది. విడాకుల కోసం దరఖాస్తు చేసుకొన్న తర్వాత ఈ మాట మరింత బలంగా ప్రచారమవుతున్నది.

సుసానే కారణంగానే

సుసానే కారణంగానే

2013 సంవత్సరంలో బాలీవుడ్ సెన్సేషన్ హృతిక్ రోషన్, సుసానే ఖాన్‌ విడిపోవడం సంచలనం రేపింది. హృతిక్ దంపతులు విడిపోవడానికి కారణం అర్జున్ రాంపాల్ అనే రూమర్ విస్తృతంగా ప్రచారమైంది. ఆ తర్వాత సుసానేకు అర్జున్ దగ్గర కావడం మెహర్‌లో అభద్రతాభావం పెరిగింది. దాంతో అర్జున్, మెహర్ మధ్య గొడవలు తీవ్రస్థాయికి చేరినట్టు సమాచారం.

నా దృష్టిలో సుసానే ఖాన్

నా దృష్టిలో సుసానే ఖాన్

సిగరెట్ తాగినప్పుడు వచ్చే పొగలో కూడా ఆడతనం కనిపించడానికి కారణం సుసానే అని అర్జున్ రాంపాల్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. వారి మధ్య సన్నిహిత సంబంధాలు ఆ డైలాగ్‌తో బజారుకెక్కాయి.

సుసానే కారణంగా గొడవలు

సుసానే కారణంగా గొడవలు

ఓ దశలో బాలీవుడ్‌లో అర్జున్ రాంపాల్ పరిస్థితి చాలా దిగజారింది. చేతిలో అవకాశాలు తగ్గిపోయాయి. స్నేహితులు దూరమయ్యారు. ఆ సమయంలోనే సుసానేకు దగ్గరయ్యాడు. అప్పుడే మెహర్‌లో అభద్రతాభావం పెరిగింది. తరచూ వారి మధ్య గొడవలు ఎక్కువయ్యాయి.

 సుసానే, మెహర్ ఒకర్నొకరు

సుసానే, మెహర్ ఒకర్నొకరు

బాలీవుడ్‌లో హీరో ఫర్దీన్ ఖాన్ ఏర్పాటు చేసిన ఓ పార్టీలో పెద్ద దుమారమే సృష్టించింది. ఆ పార్టీలో సుసానే, మెహర్ దూషించుకోవడం గందరగోళంగా మారింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఒకరినొకరు మాట్లాడుకోలేదు అని బాలీవుడ్ పత్రిక కథనం.

అర్జున్‌ రాంపాల్‌తో నా రిలేషన్

అర్జున్‌ రాంపాల్‌తో నా రిలేషన్

హృతిక్‌తో విడాకులు తీసుకొన్న తర్వాత సుసానే అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. చాలా ఏళ్లుగా అర్జున్, మెహర్ నా స్నేహితులు. మా రిలేషన్‌ను చెడుగా మాట్లాడటం బాధేసింది. మెహర్‌కు తోడుగా నేనుంటాను. నాకు, అర్జున్ మధ్య స్నేహబంధం తప్ప మరోటి లేదు అని ప్రకటనలో సుసానే తెలిపింది.

అర్జున్, మెహర్ దాంపత్య జీవితం

అర్జున్, మెహర్ దాంపత్య జీవితం

అయితే సుసానే విడాకులు తీసుకొన్న తర్వాత అర్జున్, మెహర్ జీవితం దుర్భరంగా మారింది. అర్జున్, సుసానే ఇద్దరూ సీక్రెట్‌గా కలుసుకోవడం మెహర్‌కు మన:శాంతి లేకుండా చేసింది. మానసిక క్షోభకు గురైంది. సుసానేకు దగ్గరైన తర్వాత అర్జున్ చాలా మారిపోయాడు అని మెహర్ అనేక మార్లు ఫిర్యాదు చేసిందట.

అర్జున్‌తో విభేదాలు తీవ్రస్థాయికి

అర్జున్‌తో విభేదాలు తీవ్రస్థాయికి

మెహర్, అర్జున్ రాంపాల్ మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరిన సమయంలో ఇంట్లో పెద్దగా గొడవలు జరిగేవట. గట్టిగా అరుచుకోవడం తరచూగా జరిగేదట. ఇక తమ మధ్య విభేదాలతో జీవితం సరిదిద్దుకోలేమని నిర్ణయానికి వచ్చిన తర్వాత అర్జున్ ఓ ఫైవ్ స్టార్ సర్వీస్ అపార్ట్‌మెంట్‌కు వెళిపోవడం, ఒంటరిగా జీవించడం జరుగుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X