మాజీ భర్త ముందే ప్రియుడితో లిప్‌లాక్.. స్టార్ హీరో భార్య నిర్వాకం!
బాలీవుడ్ సినిమా పరిశ్రమలో రిలేషన్స్ చూస్తే ఎవరు ఎప్పుడు ఉంటారో.. ఎవరు ఎవరితో విడిపోతారనే విషయం చెప్పడం కష్టమే అనిపిస్తుంది. బలంగా ఉందనుకొన్న బంధాలు.. బ్రేకప్ చెప్పకోవడం కళ్లారా చూసిన సంఘటనలు ఎన్నో కనిపిస్తాయి. అలాంటి వాటిలో హృతిక్ రోషన్, సుసానే ఖాన్ జంట బ్రేకప్ కూడా ఒకటే.. అయితే కొద్ది సంవత్సరాల క్రితం విడిపోయిన ఈ ఇద్దరు స్నేహితులుగానే కలిసి ఉండటం కొంత ఊరట కలిగించే విషయం. అయితే సుసానే ఖాన్, హృతిక్ రోషన్ ఇటీవల ఓ పార్టీలో కలుసుకొన్న సంఘటన వైరల్ అవుతున్నది. ఆ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్‌లో టాప్ నిర్మాతల కుటుంబాలకు చెందిన హృతిక్, సుసానే ఖాన్ ఇద్దరు చిన్నప్పటి నుంచే పరిచయస్తులు. వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. పెద్దలను ఒప్పించి హృతిక్, సుసానే ఖాన్ 2000 సంవత్సరంలో వివాహం చేసుకొని ఒక్కటయ్యారు. అయితే వారిద్దరి కాపురం బాగుందని అందరూ అనుకొంటుండగా.. 2014 సంవత్సరంలో ఇద్దరు బ్రేకప్ చెప్పుకొన్నారు. వారిద్దరి పిల్లల కోసం స్నేహితులుగా కలిసి ఉంటున్నారు.

అయితే హృతిక్ రోషన్ తన మ్యారేజ్ బ్రేకప్ తర్వాత కంగన రనౌత్, ఇతర నటీనటులతో అఫైర్ వార్తలు గుప్పుమన్నాయి. కానీ అవి కలిసి జీవించేంత వరకు రాకపోవడం గమనార్హం. అయితే ప్రస్తుతం సబా ఆజాద్ అనే సెలబ్రిటీతో డేటింగ్ చేస్తున్నారు. వారిద్దరూ ముంబైలో కలిసి తిరగడం, పార్టీలకు హాజరవ్వడం, అలాగే ఫారిన్ వెకేషన్స్‌కు వెళ్లడం ద్వారా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వస్తుంటారు.
ఇదిలా ఉండగా, భర్తతో విడిపోయిన తర్వాత సుసానే ఖాన్ కూడా మూవ్ ఆన్ అయ్యారు. తన జీవితానికి సంబంధించిన ఆనందాన్ని వెతుక్కోవడం ప్రారంభించారు.ఈ క్రమంలోనే బాలీవుడ్ సెలబ్రిటీ అర్సలాన్ గోనితో ప్రేమలో పడ్డారు. వారిద్దరూ ప్రస్తుతం పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి కనిపిస్తున్నారు. వారిద్దరి డేటింగ్ లైఫ్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇదిలా ఉండగా, సుసానే ఖాన్ తన 49వ పుట్టిన రోజున ముంబైలో ఘనంగా జరుపుకొన్నారు. ఈ పార్టీకి తన స్నేహితులతోపాటు సన్నిహితులను, శ్రేయోభిలాషులను ఆహ్వానించారు. ఈ విందుకు తన మాజీ భర్త హృతిక్‌ను కూడా పిలిచారు. ఈ పార్టీలో ఫుల్ జజోష్‌లో ఉన్న ఆమె.. తన ప్రియుడు అరస్లాన్ ఖాన్‌ను లిక్‌లాక్‌లు, ముద్దులతో ముంచెత్తారు. దాంతో అక్కడ ఉన్న వారంతా హృతిక్‌ను చూస్తూ ఉండిపోయారు అని సోషల్ మీడియాలో పోస్టులు చేసి చర్చించుకొంటున్నారు.


Click it and Unblock the Notifications











