కరోనా కలిపింది ఇద్దరిని.. ఒకే ఇంట్లో హృతిక్, సుసానే.. సోషల్ డిస్టెన్స్‌కు మంగళం
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ దాంపత్య జీవితానికి అర్ధాంతరంగా ముగింపు పడిన విషయం తెలిసిందే. 2013లో భార్య సుసానే ఖాన్‌తో విడాకులు తీసుకోవడం బాలీవుడ్‌లో సంచలనం రేపింది. ఆ తర్వాత వారిద్దరు తమ పిల్లల కోసం స్నేహితులుగా ఉంటూనే ఉన్నారు. వారికి హ్రేహాన్, హృదాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వైవాహిక జీవితపరంగా కలిసి ఉండకపోయినా.. స్నేహితుల్లా మాత్రం సందర్భోచితంగా కలుసుకొంటున్నారు. తాజాగా వారిద్దరిని కరోనా కలిపింది.

కరోనాతో సోషల్ డిస్టెన్స్ మంగళం
కరోనావైరస్ కారణంగా సోషల్ డిస్టెన్స్ పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు చేస్తుంటే.. బాలీవుడ్ జంట మాత్రం ఒకరికొకరు మానసికంగా దగ్గరయ్యారు. గత కొద్దికాలంగా విడాకులు తీసుకొని ఉంటున్న హృతిక్, సుసానే ఖాన్ మాత్రం ఇప్పుడు కరోనా కారణంగా ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఈ విషయం బాలీవుడ్‌లోనూ, అభిమానుల్లోనూ చర్చనీయాంశమైంది.

సుసానేలో తల్లిప్రేమ..
దేశవ్యాప్తంగా కరోనా భయాలు నెలకొన్నడంతో సుసానే ఖాన్‌లో తల్లి ప్రేమ పొంగింది. తన కుమారులకు ఎలాంటి ఆపద కలగకుండా జాగ్రత్త తీసుకోవాలనుకొన్నది. వెంటనే తన కుమారుల వద్దకు వెళ్లింది. హృతిక్ ఇంట్లో ఉన్న హ్రేహాన్, హృదాన్‌కు తోడుగా నిలిచింది. వారిని కంటికి రెప్పలా చూసుకొంటూ తల్లి ప్రేమను పంచింది.

మా ఇంట్లోకి సుసానే..
తన పిల్లల బాగోగుల కోసం సుసానే ఖాన్ నా ఇంటికి వచ్చింది. కొద్దిరోజులుగా సుసానే మా ఇంట్లోనే ఉంటూ పిల్లల్ని చూసుకొంటున్నది. తన కుమారుల పట్ల ప్రేమకు నిదర్శనంగా నిలిచింది అంటూ హృతిక్ రోషన్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో ఫోటోను పోస్టు చేశారు.
Recommended Video
థ్యాంక్యూ సుసానే ఖాన్
ఇధి డియర్ సుసానే (నా మాజీ భార్య) ఫోటో ఇది. పిల్లల సంరక్షణ కోసం తాత్కాలికంగా తన ఇంటి నుంచి మా ఇంటికి వచ్చింది. తల్లిదండ్రులగా మన బాధ్యతలను గుర్తు చేస్తూ నీవు తీసుకొన్న నిర్ణయానికి థ్యాంక్స్ అంటూ హృతిక్ ఓ పోస్టు పెట్టారు.


Click it and Unblock the Notifications











