ఆ ఒక్క విషయంలో అన్యాయం చేశాడు.. జీవితమనేది సినిమా కాదు.. ఇర్ఫాన్ ఖాన్ భార్య ఎమోషనల్ పోస్ట్
బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతి పట్ల యావత్ భారతదేశం సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఇర్ఫాన్ మరణం తీరని లోటని, కుటుంబ సభ్యుడు చనిపోయాడన్నంత బాధ కలుగుతోందని అందరూ దు:ఖించారు. అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఇర్ఫాన్ మృతిపట్ల సోషల్ మీడియా మొత్తం మూగబోయింది. ఈ మేరకు ఇర్ఫాన్ భార్య సుతాపా, పిల్లలు ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. దాని సారాంశం ఏంటంటే..
ఇర్ఫాన్ మరణం నష్టం కాదు లాభం..
మాతో పాటు యావత్ ప్రపంచం రోదిస్తుంటే ఇది కేవలం కుటుంబ ప్రకటన మాత్రమే అని ఎలా చెప్పగలను? ప్రతి ఒక్కరికీ చెబుతున్నాను, ఇది మాకు నష్టం కాదు, లాభం. ఇర్ఫాన్ మృతి పట్ల ఎంతో మంది మాతో కలిసి బాధపడుతున్నారు. ఇర్ఫాన్ మాటల్లో చెప్పాలంటే ఇదంతా ఓ మ్యాజిక్ లా ఉంది. ఇర్ఫాన్ ఎప్పుడూ దేన్నీ దాని స్థాయి, లక్షణం ఆధారంగా ప్రేమించలేదు.

ఒక్క విషయంలో అన్యాయం..
ఒక్క విషయంలో మాత్రం నాకు అన్యాయం చేశాడు. పర్ఫెక్షన్ అంటూ పరితపించే అతని కోసం నేను ఏ విషయాన్ని సాధారణంగా తీసుకోలేకపోయాను. ప్రతి అంశంలోనూ ఓ పద్దతి, లయను గుర్తించేవాడు. ఇర్ఫాన్‌కు క్యాన్సర్ సోకినప్పటి నుంచి గడిచిన రెండు, రెండున్నరేళ్ల కాలాన్ని మేం బాధాతప్త సమయంగా భావించడంలేదు. అదో తియ్యటి వేదనాభరితమైన కాలంగానే భావించాం. ఎంతోమంది సహృదయులైన వైద్యులు మాతో కలిసి పయనించారు.

మాదో పడవ ప్రయాణం..
35 ఏళ్ల మా సాహచర్యం అటుంచితే, జీవితం ప్రతి అంశంలో ఇర్ఫాన్ ఓ సంగీతకారుడిలా బాణీలు కూర్చాడు. మాది పెళ్లి అని చెప్పుకోం, అదో కలయిక. మాది ఓ పడవ ప్రయాణం లాంటిది. ఓ పడవలో నేను, ఇర్ఫాన్, మా పిల్లలు అయాన్, బాబిల్ వెళుతుంటే.. మార్గనిర్దేశం చేసేవాడు ఇర్ఫాన్. పిల్లలిద్దరూ చెరో వైపు ఉండి పడవను ముందుకు నడిపించేవారు.

ఇక్కడ రీటేక్‌లు ఉండవు..
అయినా జీవితం అనేది సినిమా కాదు కదా. ఇక్కడ రీటేక్స్ అనేవి వుండవు.. అందుకే, ఇకపై ఇర్ఫాన్ లేకపోయినా, అతను చూపించిన దారిలో మా పిల్లలు తమ పడవ ప్రయాణాన్ని తుపానులో సైతం సవ్యమైన రీతిలో సాగించాలని కోరుకుంటున్నాను" అంటూ సుతాపా ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది.


Click it and Unblock the Notifications











