మీడియా రియాను బలిపశువును చేసింది - స్వరా భాస్కర్
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డెత్ మిస్టరీ రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రస్తుతం అందరి దృష్ఠీ సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా పైనే ఉంది. ఆమె ఈ కేసులో కీలకంగా మారడంతో పాటూ, ఈడీ ఆమెను రెండు సార్లు ప్రశ్నోత్తరాల నిమిత్తం పిలిపించడంతో కేసు రోజురోజుకీ ఝటిలమవుతోంది. అయితే అందరూ రియాను అనుమాన దృష్టితో చూస్తుండటంతో నటి స్వరా భాస్కర్ మాత్రం అమ్మడికి మద్దతుగా నలిచింది.
పలు మీడియా ఇష్టరీతిన రియాపై కథనాలు ప్రచురిస్తుండటంపై స్పందించిన స్వరా, సోషల్ మీడియాలో రియాకు తన మద్దతు ప్రకటించింది. ఓ వర్గం మీడియా ఆమెను నేరస్థురాలిగా చిత్రీకరిస్తోందని, దీని వల్ల ఆమె తీవ్ర ఆందోళనకు గురౌతోందని ట్విట్టర్ ద్వారా తెలిపింది. మరోవైపు రియా సైతం మీడియా కుట్రపూరిత కథనాలపై సుప్రీం కోర్టులో పిటిషన్ ను ఫైల్ చేసిన సంగతి తెలిసిందే.

కోర్టు తీర్పు వెలువడక ముందే, ఆమే నేరం చేసిందన్నట్లు పలు మీడియాలో కథనాలు ప్రచురితం అయ్యాయని, స్వరా తెలిపింది. రూపోప్లిక్, పూప్ ఇండియా, వంటి ఛానళ్లు ఏమాత్రం ఆధారాలు లేని అసత్య కథనాలు ప్రచురితం చేస్తున్నాయని, సుప్రీం కోర్డు ఈ అంశంపై దృష్టి సారించాల్సి ఉందని పేర్కొంది. చట్టాన్ని తన పని చేసుకోనివ్వాల్సందిగా సదరు ఛానళ్లనుూ కోరింది.


Click it and Unblock the Notifications











