twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరణ్ జోహర్‌ను వెనకేసుకొచ్చిన స్వర భాస్కర్.. ఆమెతో పోల్చుతూ ఏకిపారేస్తున్న నెటిజన్స్

    |

    సుశాంత్ సింగ్ మృతితో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సుశాంత్ ఆత్మహత్యతో బాలీవుడ్ మొత్తం గరంగరంగా ఉంది. కొందరు సెలెబ్రిటీలు బాహాటంగానే నెపోటిజంపై ప్రశ్నలు కురిపిస్తూ సినీ పెద్దలను వేలెత్తి చూపిస్తున్నారు. అందులో భాగంగా కరణ్ జోహర్, సల్మాన్ ఖాన్‌పై సెలెబ్రిటీలతో పాటు నెటిజన్లు మండి పడుతున్నారు. నెపోటిజమనేది ఎంతలా పాతుకుపోయిందో, సల్మాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా వెళ్తే ఏం జరుగుతోంది దబంగ్ డైరెక్టర్ అభినవ్ కశ్యప్ వివరించాడు. ఇలా బాలీవుడ్‌లోని కొందరు వ్యక్తులు నెపోటిజంపై పోరాడుతున్నారు.

    Recommended Video

    Sushant Singh Rajput : Karan Johar మంచోడు.. అతనిలో Nepotism లేదు అంటున్న Swara Bhaskar!|| Oneindia
    సుశాంత్ మృతి..

    సుశాంత్ మృతి..

    సుశాంత్ సింగ్ డిప్రెషన్ కారణంగానే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని అంటున్నారు. అది హత్య అని నిరూపించేందుకు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు కూడా లభ్యం కాలేదు. కనీసం సూసైడ్ నోట్ కూడా లభించలేదు.అయితే ఇది కచ్చితంగా బాలీవుడ్ చేసిన హత్యేనని నెటజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ విషయంలో సీబీఐ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

    నెపోటిజంపై ఫైర్..

    నెపోటిజంపై ఫైర్..

    బాలీవుడ్‌లో పాతుకుపోయిన నెపోటిజంపై సుశాంత్ మరణంతో మళ్లీ చర్చల్లోకి వచ్చింది. అంతకు ముందు కూడా కంగనా రనౌత్ వంటి వారు గళమెత్తినా ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ అప్పుడు కంగనా లేవనెత్తిన అంశాలే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఎవ్వరి క్రెడిట్స్ వారికి ఇవ్వకుండా, తొక్కేస్తుంటారని, బాలీవుడ్ మూవీ మాఫియా అని కరణ్ జోహర్‌ను కంగనా కంగనా గతంలో ప్రశ్నించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.

    స్వర భాస్కర్ సైతం..

    స్వర భాస్కర్ సైతం..

    బాలీవుడ్‌లో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే స్వర భాస్కర్ సైతం గతంలోని ఓ ఈవెంట్‌లో నెపోటిజంపై కరణ్ జోహర్‌ను ప్రశ్నించింది. నిర్మాతగా, దర్శకుడిగా బాలీవుడ్‌లో ఎన్నో మార్పులు తీసుకొచ్చారని, అందుకు చాలా సంతోషమని చెప్పుకొచ్చింది. అయితే కేవలం స్టార్ కిడ్స్‌ను లాంచ్ చేయడం యాధృచ్చికంగా జరిగిందా?కావాలనే లాంచ్ చేశారా? మా లాంటి వారికి ఇండస్ట్రీలోకి ఎలా రావాలో దారి తెలియడం లేదని కరణ్ జోహర్‌ను ప్రశ్నించింది.

     కరణ్ సమాధానం..

    కరణ్ సమాధానం..


    వరుణ్ దావన్, అలియాలను మాత్రమే లాంచ్ చేశానని, అది కూడా అనుకుని చేయలేదని తెలిపాడు. వరుణ్ ధావన్‌ను వాళ్ల అమ్మ అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేర్చుకోమ్మని చెప్పింది కానీ అతడి టాలెంట్ చూసి హీరోగా చాన్స్ ఇచ్చామని, అలాగే సిద్దార్థ్ మల్హోత్ర విషయంలోనూ జరిగిందని తెలిపాడు. అయితే మహేష్ భట్‌తో తనకు చాలా కాలం నుంచి విబేధాలున్నాయని, అలియా గురించి తనకు ఎక్కువగా తెలీదని వారిని కావాలని అనుకుని లాంచ్ చేయలేదని తెలిపాడు.

    వెనకేసుకొచ్చిన స్వర..

    వెనకేసుకొచ్చిన స్వర..


    ప్రస్తుతం కరణ్ జోహర్‌ను సోషల్ మీడియాలో ఆడుకుంటున్న సంగతి తెలిసిందే. నెపోటిజం కింగ్ అని ట్రోల్స్ చేస్తుండగా.. స్వర భాస్కర్ అతడిని సమర్ధించింది. గతంలో కరణ్ జోహర్ నెపోటిజంపై ఏ మాత్రం తడుముకోకుండా చాలా స్పష్టమైన సమాధానం చెప్పాడని, అతడికి నెపోటిజం లేదని చెప్పుకొచ్చింది.

    స్వరపై నెటిజన్స్ ఫైర్..

    స్వరపై నెటిజన్స్ ఫైర్..


    అయితే స్వర భాస్కర ఇలా ప్లేటు మార్చడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. నువ్ ఎంత కాకపట్టినా నీకు ధర్మ ప్రొడక్షన్స్‌లో ఛాన్స్ రాదు, నువ్ కంగనా స్థాయికి ఎప్పుడూ చేరుకోలేవు, అందుకే కంగనాను క్వీన్ అని అంటారని కామెంట్స్ చేస్తున్నారు.

    English summary
    Swara Bhaskar Gets Trolled For Supporting Karan Johar On Nepotism. Let’s take a moment & acknowledge that karanjohar took this question on the chin, & answered in a candid & honest manner not taking unwarranted personal offense. Let’s also acknowledge that he didn’t have the infamous #nepotism comment removed from his chat show which he cud’ve
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X