ఇకపై స్మోకింగ్ చేయనంటున్న హీరోయిన్!
కరీనా కపూర్, సోనమ్ కపూర్, స్వరభాస్కర్, శిఖా తల్సానియా ప్రధాన పాత్రలో నటించిన బాలీవుడ్ చిత్రం వీర్ దె వెడ్డింగ్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. వెడ్డింగ్ ప్రధానాంశంగా ఈ చిత్రం సాగుతుంది. జూన్ 1 న ఈ చిత్రం విడుదలవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ చిత్రానికి సంబందించిన ఓ ఈవెంట్ లో స్వరభాస్కర్ మాట్లాడుతూ తన పాత్ర గురించి వివరించింది.
ఈ చిత్రంలో స్వరభాస్కర్ చైన్ స్మోకర్ గా కనిపిస్తుందట. ఓ సన్నివేశంలో స్మోకింగ్ చేయాల్సి వచ్చినప్పుడు తాను సరిగా చేయలేకపోయానని స్వరభాస్కర్ వివరించింది. ఆ తరువాత ఎలాగో తంటాలు పడి దర్శకుడిని మెప్పించా. నా మొత్తం జీవితంలో అది చేదు అనుభవం అని స్వరభాస్కర్ తెలిపింది.

ఇకపై ఎవరైనా స్మోకింగ్ చేసే పత్రాలు ఆఫర్ చేస్తే వెంటనే నో చెప్పేస్తా అని ఈ భామ చెబుతోంది. కరీనా కపూర్, సోనమ్, స్వర భాస్కర్, శిఖా తల్సానియా అందాలు ఒలకబోసి ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.శశాంక్ ఘోష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.


Click it and Unblock the Notifications











