Swara Bhaskar: రాజకీయ నాయకుడిని సీక్రెట్ గా వివాహం చేసుకున్న నటి.. ఫొటోలు వైరల్!

సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య వివాహాలు జరుగుతున్నాయి. అందులోనూ వాటిలో ఎక్కువగా ప్రేమ పెళ్లిళ్లే ఉంటున్నాయి. ఇటీవలే బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్రోత్రా ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఒక పొలిటిషియన్ ను ప్రేమించి రహస్యంగా పెళ్లి చేసుకుంది బాలీవుడ్ నటి. ఆమె ఎవరో కాదు స్వర భాస్కర్. బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ తర్వాత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో పేరు తెచ్చుకుంది స్వర భాస్కర్. ఎక్కువగా ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో మెరిసే స్వర భాస్కర్ తాజాగా తాను పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించింది. అయితే ఆమె ఒక రాజకీయవేత్త, సోషల్ ఆక్టివిస్ట్ ను సీక్రెట్ గా పెళ్లాడింది.

 వివాదాస్పద వ్యాఖ్యలతో..

వివాదాస్పద వ్యాఖ్యలతో..

బాలీవుడ్ ముద్దుగుమ్మ స్వర భాస్కర్ తన అభిమానులకు తాజాగా షాక్ ఇచ్చింది. తన రిలేషన్ షిప్ మారినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఎన్నో సినిమాలు పలు కీలక పాత్రలు పోషించిన స్వర భాస్కర్ ఢిల్లీలో పుట్టి పెరిగింది. 2009లో మధోలాల్ కీప్ వాకింగ్ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అటు సినిమాలతో, మరోవైపు వివాదాస్పద వ్యాఖ్యలతో మోస్ట్ పాపులర్ అయింది. అలాగే డేటింగ్ రూమర్స్ తో కూడా నిత్యం వార్తల్లో నిలిచేది ఈ బ్యూటిఫుల్ యాక్ట్రెస్. స్వర భాస్కర్ కు తను వెడ్స్ మను, రాంఝనా, తను వెడ్స్ మను రిటర్న్స్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, వీరే ది వెడ్డింగ్ వంటి సినిమాలు మంచి పేరు తీసుకొచ్చాయి.

సల్మాన్ ఖాన్ కు చెల్లెలుగా..

సల్మాన్ ఖాన్ కు చెల్లెలుగా..

ప్రేమ్ రతన్ ధన్ పాయో చిత్రంలో సల్మాన్ ఖాన్ కు పెద్ద చెల్లెలుగా నటించి ఆకట్టుకున్న స్వర భాస్కర్ టీవీ షోలకు హోస్ట్ గా వ్యవహరించింది. ఇక తను వెడ్స్ మను, రాంఝనా సినిమాలకు ఉత్తమ సహాయ నటిగా జీ సినీ అవార్డు కూడా అందుకుంది. అలాగే పలు ప్రతిష్టాత్మక అవార్డ్సుకు నామినేట్ అయింది. ఇదిలా ఉంటే తాజాగా తన పెళ్లి వార్తను సోషల్ మీడియా వేదికగా చెబుతూ పంచుకుంది.

సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు..

సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు..

అయితే స్వర భాస్కర్ గత కొంతకాలంగా ఎవరితోనే డేటింగ్ చేస్తోందని పలు వార్తలు వచ్చాయి. స్వర భాస్కర్.. సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర యూత్ అధ్యక్షుడు, సోషల్ ఆక్టివిస్ట్ ఫహాద్ అహ్మద్ ను జనవరి 6న పెళ్లి చేసుకున్నట్లు తాజాగా ప్రకటించింది. అందుకు సంబంధించిన ఎమోషనల్ వీడియోను షేర్ చేసింది స్వర భాస్కర్.

జనవరి 6న పెళ్లి..

వీడియోలో తమ రిలేషన్ షిప్ టైమ్ లైన్ ను ప్రదర్షించే ఫొటోలు, క్లిప్పింగ్ లతో కలిగి ఉంది. ఒక నిరసన కార్యక్రమం వద్ద ఇద్దరి మీటింగ్ నుంచి ఒకరి ట్వీట్ లను మరొకరు చర్చించుకోవడం వరకు ఈ వీడియోలో మనం చూడొచ్చు. ఈ జంట ఒక పెంపుడు పిల్లిని దత్తత కూడా తీసుకున్నారు. మొత్తానికి స్వర భాస్కర్, ఫహద్ జనవరి 6న వివాహబంధంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్లి రిజిస్ట్రేషన్ కు సంబంధించిన పత్రాలను కూడా ఆ వీడియోలో చూడొచ్చు.

అస్తవ్యస్తంగా ఉన్న గుండెలోకి..

స్వర భాస్కర్ షేర్ చేసిన వీడియోకు.. "కొన్నిసార్లు పక్కనే ఉన్నదానికోసం చాలా దూరం విస్తృతంగా వెతుకుతాం. మేం ప్రేమ కోసం, ఎదురుచూశాం. కానీ, ముందుగా స్నేహాన్ని కనుగొన్నాం. ఆ తర్వాత ఒకరి గురించి మరొకరం తెలుసుకున్నాం. నా గుండె చప్పుడు ఫహద్ జిరార్ అహ్మద్ కు స్వాగతం. ఇది కొంచెం అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ నీదే" అని రాసుకొచ్చింది.

రచయితతో డేటింగ్..


స్వర భాస్కర్ షేర్ చేసిన వీడియోకు కామెంట్స్ వస్తున్నాయి. అలాగే కొత్త పెళ్లి జంటకు అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఇదివరకు ఒకరి చేతుల్లో స్వర ముఖం పెట్టి ఉన్న పోస్ట్ షేర్ చేసింది. ఆ పోస్టుతో ఆమె రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు అవి నిజం అయ్యాయి. ఇదిలా ఉంటే స్వర భాస్కర్ రచయిత హిమాన్షు శర్మతో డేటింగ్ చేసినట్లుగా పుకార్లు వచ్చాయి. 5 సంవత్సరాల డేటింగ్ తర్వాత 2019లో వారు విడిపోయారని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X