అన్నయ్య అని పిలిచిన వ్యక్తితో నటి వివాహం.. ఫస్ట్ నైట్ ఫొటోలు షేర్ చేసిన బ్యూటి

ఇటీవల కాలంలో చిత్ర పరిశ్రమలో వరుసగా విషాదాలతోపాటు ప్రేమ వివాహాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రేమించి పెళ్లడగా.. గతేడాది కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా తెలుగు హీరో మంచు మనోజ్ మార్చి 3న పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. ఇదంతా పక్కన పెడితే.. అన్నయ్య అంటూ పిలిచిన వ్యక్తిని పెళ్లి చేసుకుని ఇటీవల షాక్ ఇచ్చింది బాలీవుడ్ ముద్దుగుమ్మ, వివాదాస్పద బ్యూటి స్వర భాస్కర్. ఇదే ఆశ్చర్యంగా ఉంటే తాజాగా తన ఫస్ట్ నైట్ ఫొటోలు షేర్ చేసి ఇంకాస్తా డోస్ పెంచింది.

 20 సినిమాలకుపైగా..

20 సినిమాలకుపైగా..

ఢిల్లీలో పుట్టి పెరిగిన ముద్దుగుమ్మ స్వర భాస్కర్ 2009లో మధోలాల్ కీప్ వాకింగ్ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఓ వైపు సినిమాలతో, మరోవైపు కాంట్రవర్సీ కామెంట్లతో మోస్ట్ హిందీ చిత్ర పరిశ్రమలో మోస్ట్ పాపులర్ అయింది ఈ బ్యూటి. అలాగే డేటింగ్ రూమర్స్ తో కూడా నిత్యం వార్తల్లో నిలిచేది ఈ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. దాదాపుగా 20కిపైగా సినిమాల్లో నటించిన బోల్డ్ బ్యూటి తన అందం, నటనతో ప్రేక్షకులను మాత్రం ఎంతగానో ఆకట్టుకుంది.

కంగనా రనౌత్ తర్వాత..

కంగనా రనౌత్ తర్వాత..

కంగనా రనౌత్ తర్వాత అంతటి బోల్డ్ అండ్ కాంట్రవర్సీ బ్యూటిగా పేరు తెచ్చుకున్న స్వర భాస్కర్ కు తను వెడ్స్ మను, చిల్లర్ పార్టీ, రాంఝనా, తను వెడ్స్ మను రిటర్న్స్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, వీరే ది వెడ్డింగ్ వంటి సినిమాలు మంచి పేరు తీసుకొచ్చాయి. ప్రేమ్ రతన్ ధన్ పాయో చిత్రంలో సల్మాన్ ఖాన్ కు పెద్ద చెల్లెలుగా నటించి ఆకట్టుకున్న స్వర భాస్కర్ పలు టీవీ షోలకు హోస్ట్ గా కూడా వ్యవహరించింది.

రైటర్ తో ప్రేమాయణం..

రైటర్ తో ప్రేమాయణం..

కంగనా రనౌత్ లీడ్ రోల్ చేసిన తను వెడ్స్ మను, ధనుష్ రాంఝనా సినిమాలకు ఉత్తమ సహాయ నటిగా జీ సినీ అవార్డు కూడా అందుకుంది బోల్డ్ భామ స్వర భాస్కర్. అలాగే పలు ప్రతిష్టాత్మక అవార్డ్సుకు నామినేట్ అయింది. ఇక ఇటీవల కాలంలో సైలెంట్ గా ఉన్న ఈ భామ ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపి హిందీ చిత్ర పరిశ్రమ ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. గతంలో స్వర రచయిత హిమాన్షు శర్మతో డేటింగ్ చేసినట్లుగా వార్తుల వచ్చాయి.

 మొదట్లో సోదరుడు అంటూ..

మొదట్లో సోదరుడు అంటూ..

ముద్దుగుమ్మ స్వర భాస్కర్ రైటర్ హిమాన్షు శర్మతో ఐదేళ్ల డేటింగ్ తర్వాత 2019లో విడిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సమాజ్ వాది పార్టీ రాష్ట్ర యూత్ అధ్యక్షుడు, సోషల్ యాక్టివిస్ట్ ఫహాద్ అహ్మద్ ను ప్రేమించి పెళ్లాడినట్లు ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే మొదట్లో అతన్ని తన సోదరుడిగా భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. ఇక పెళ్లి విషయం వెల్లడించేసరికి ప్రేక్షకులు, నెటిజన్లు షాక్ అయ్యారు.

లవ్ జర్నీ చూపిస్తూ..

లవ్ జర్నీ చూపిస్తూ..

ఫహాద్ అహ్మద్ ను జనవరి 6న స్పెషల్ మ్యారేజ్ యాక్టి కింద ఒక కోర్టులో అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకుంది బాలీవుడ్ నటి స్వరా భాస్కర్. ఈ విషయాన్ని తెలియజేస్తూ తన లవ్ జర్నీ ఎలా ప్రారంభం అయిందో తెలుపుతూ ఒక వీడియోను పంచుకుంది. ఈ వీడియోకు "మేం ప్రేమ కోసం, ఎదురుచూశాం. కానీ, ముందుగా స్నేహాన్ని కనుగొన్నాం. ఆ తర్వాత ఒకరి గురించి మరొకరం తెలుసుకున్నాం. నా గుండె చప్పుడు ఫహద్ జిరార్ అహ్మద్ కు స్వాగతం" అంటూ రాసుకొచ్చింది.

 ఆమె తల్లి అలంకరించిందంటూ..

ఆమె తల్లి అలంకరించిందంటూ..

తాజాగా తమ ఫస్ట్ నైట్ కు సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది స్వరా భాస్కర్. హనీమూన్ బెడ్ ను వివిధ రంగుల గులాబీలు, పూలతో ఆమె తల్లి అలంకరించిందంటూ ఫొటోలు పెట్టి పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫొటోలు ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. వారి వివాహంపై కూడా పలు విధాలుగా స్పందిస్తున్నారు. ఇన్నాళ్లు ఫహాద్ అహ్మద్ ని అన్నయ్య అని పిలిచి.. ఇప్పుడు ఎలా పెళ్లి చేసుకుంది అని ప్రశ్నిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X