ఆంటీ అని పిలవడంతో పిల్లోడిని బూతులు తిట్టిన నటి.. సోషల్ మీడియాలో నెటిజన్ల ఫైర్

By Manoj

Recommended Video

ఆంటీ అని పిలవడంతో పిల్లోడిని బూతులు తిట్టిన నటి

వీరే దీ వెడ్డింగ్ సినిమాలోని ఆ ఒక్క సీన్.. స్వరా భాస్కర్ ఫేట్‌నే మార్చేసింది. కరీనా కపూర్, సోనమ్ కపూర్ లాంటి స్టార్స్ నటించిన వీరే దీ వెడ్డింగ్ సినిమాలో భర్తకు దూరంగా ఉన్న భార్య.. స్వయం సంతృప్తి పొందే సన్నివేశం అప్పట్లో ఎంతగా వైరల్ అయిందో తెలిసిందే. ఈ ఒక్క సీన్ సినిమాకే హైలెట్‌గా మారింది. ఆ క్యారెక్టర్‌లో నటించిన స్వర భాస్కర్ ఒక్కసారిగా ఫేమస్ అయి వార్తల్లోకెక్కింది. తాజాగా మరోసారి ఆ నటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 సినిమాలే కాదు.. వివాదాలతోనూ..

సినిమాలే కాదు.. వివాదాలతోనూ..

తనదైన నట ప్రతిభతోనే కాదు.. పలు వివాదాలతోనూ స్వరా భాస్కర్ పేరు ఇటీవల పాపులరైంది. ఈ ట్యాలెంటెడ్ బాలీవుడ్ నటికి హిందీలోనే కాదు.. ఇటు తెలుగు నాటా ఫ్యాన్స్ ఉన్నారు. తను వెడ్స్ మను- రాంజానా- వీరే ది వెడ్డింగ్ లాంటి సినిమాల్లో స్వరా నటనకు మనవాళ్లు కూడా ఫిదా అయిపోయారంతా. ఇక ఈ భామ మీటూ వేదికగా పలువురిపై ఆరోపించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో పురుషాధిక్యత.. వేధింపుల కల్చర్ పై తీవ్రంగానే దుమ్మెత్తిపోసింది.

రీసెంట్‌గా ఓ షోలో..

రీసెంట్‌గా ఓ షోలో..

ఇక మగువల్లో ఐడియలిజం గురించి మాట్లాడే ఈ అమ్మడు ఓ చిన్నారిని నోటికొచ్చినట్టు తిట్టేస్తూ అడ్డంగా దొరికిపోయింది. ఆ వీడియో సాక్ష్యం కాస్తా సామాజిక మాధ్యమాల్లోకి లీకవ్వడంతో నెటిజన్లు చెడుగుడు ఆడేస్తున్నారు. `షో ఆఫ్ అబీష్` చాట్ షోలో
పాల్గొంటూ గతంతో జరిగిన ఓ ఇన్సిడెంట్‌ను గుర్తుకు చేసుకుంది.

ఓ యాడ్ షూట్‌లో ఆ ఘటన

ఓ యాడ్ షూట్‌లో ఆ ఘటన

ఈ చాట్ షోలో పాల్గొంటూ గతంలో.. తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పుకొచ్చింది. ఒక యాడ్‌లో ఓ చిన్న పిల్లాడితో కలిసి నటించానని, అయితే ఆ బుడ్డోడు తనను ఆంటీ అని పిలిచాడని, తనకు చాలా కోపం వచ్చిందని చెప్పుకుంటూ ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ పిల్లోడిని కమీనా, చుతియా అంటూ ఇష్టమున్నట్లు తిట్టేసింది.

సోషల్ మీడియాలో నెటిజన్ల ఫైర్..

ఈ మాటలు విన్న సోషల్ మీడియా జనం స్వరని ఫుల్ గా రివర్సులో ఆడుకుంటున్నారు. #స్వర ఆంటీ అంటూ అందరూ తిట్టిపోస్తున్నారు. జాతీయ బాలల భద్రతా హక్కుల కమీషన్ కి ఫిర్యాదు చేయాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. ఆ మేరకు పలు ఎన్జీవోలు గొంతు విప్పాయి.

More from Filmibeat

Read more about: swara bhaskar me too మీటూ
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X