twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెరపై మళ్లీ స్వలింగ సంపర్కం.. ఈ సారి మహిళలతో.. వివాదం వైపుగా షీర్ ఖోర్మా

    |

    ఓ వైపు శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్ చిత్రంపై రగడ కొనసాగుతుంటే.. స్వలింగ సంపర్కం కథతో మరో సినిమా ట్రైలర్ హిందీ చిత్ర పరిశ్రమను తాకింది. షీర్ ఖొర్మా అనే చిత్రం టీజర్‌పై ప్రస్తుతంగా వాడివేడి చర్చ జరుగుతున్నది. దీంతో బాలీవుడ్‌లో సంప్రదాయ కథలకు తిలోదకాలు ఇచ్చిందనే వాదన తెరపైకి వచ్చింది. ఇక షీర్ ఖోర్మా కథ ఏమిటంటే..

    హోమో సెక్సువల్ ప్రేమ కథతో

    హోమో సెక్సువల్ ప్రేమ కథతో

    హోమో సెక్సువల్ ప్రేమ కథతో షీర్ ఖోర్మా చిత్రం రూపొందినట్టు ట్రైలర్ చెప్పకనే చెప్పింది. బాలీవుడ్ తారలు స్వర భాష్కర్, దివ్యాదత్తాలు ప్రేమికులుగా నటించారు. ఫరజ్ ఆరీఫ్ అన్సారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో స్వర భాస్కర్, దివ్యదత్తాలు స్వలింగ సంపర్క జంటగా నటించడం గమనార్హం.

    ప్రేమికురాలిని వెతుక్కొంటూ..

    ట్రైలర్ కనిపించిన అంశాల ప్రకారం.. స్వరభాస్కర్ ఈ చిత్రంలో కెనడాకు చెందిన పాకిస్థాన్ సంతతి యువతి సితార పాత్రలో నటించారు. తన ప్రేమికురాలు సైరా (దివ్యదత్తా)ను వెతుక్కుంటూ భారత్‌కు వచ్చే మహిళ పాత్రలో నటించారు. దివ్యదత్తా తల్లిపాత్రలో షబానా ఆజ్మీ నటించారు.

    ప్రేమకు తల్లి అంగీకారం

    ప్రేమకు తల్లి అంగీకారం

    కట్టుబాట్లను ఎదురించిన సైరా తన ప్రేమకు తల్లి అంగీకారం కోసం ప్రయత్నించడం ఈ ట్రైలర్‌లో కనిపించింది. ఈ చిత్రంలో బిగ్‌బాస్ కంటెస్టెంట్, రచయిత ప్రియా మాలిక్ కూడా నటించారు. ఇటీవల చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్‌పై నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేయడం తెలిసిందే.

    Recommended Video

    Mahesh Babu In An Aggressive Role In Chiru 152 | Megastar Chiranjeevi | Koratala Siva
    21వ శతాబ్దంలో తల్లి పాత్ర

    21వ శతాబ్దంలో తల్లి పాత్ర

    షీర్ ఖోర్మా సినిమా షూటింగ్ ఆరంభం సందర్భంగా దర్శకుడు ఫరజ్ అజ్మీ అన్సారీ మాట్లాడుతూ.. తల్లిదండ్రుల పెంపకం.. సమాజంలో మార్పు అనే అంశాలను షబానా క్యారెక్టర్‌లో చూపించబోతున్నాం. 21వ శతాబ్దానికి చెందిన మాతృమూర్తి కోణాన్ని ఆవిష్కరించబోతున్నాం. షబానా ఆజ్మీ పాత్ర ప్రశంసలకు నోచుకొంటుంది అని అజ్మీ అన్సారీ అన్నారు.

    English summary
    Another LGBTQ love story hitting bollywood screen after Shubh Mangal Zyada Saavdhan. Sheer Qorma homo sexual love story, Which acted by Swara Bhaskar, Divya Dutta.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X