దేవుడి దర్శనానికి వెళ్లిన హీరోయిన్‌కు ఊహించని అనుభవం!
గుడికి వెళ్లి దైవ దర్శనం చేసుకుని బయటకు వచ్చి చూస్తే మన పాదరక్షలు మాయమవ్వడం లాంటి సంఘటనలు దాదాపు ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే ఉంటాయి. ఇపుడు ఇలాంటి సంఘటనే బాలీవుడ్ నటి స్వర భాస్కర్‌కు ఎదురైంది. గణేష్ చతుర్థి సందర్భంగా ముంబైలో ప్రసిద్ధిగాంచిన లాల్‌బాగ్చ రాజా(వినాయకుడు)ని స్వర భాస్కర్ సందర్శించి చెప్పులు లేకుండా తిరిగి రావలసి వచ్చింది.
భారత దేశం మొత్తం గణేష్ చతుర్థి వేడుకల్లో మునిగిపోయింది, ముంబైలోని అత్యంత వైభవంగా ఈ వేడుకలు జరుగుతూ ఉంటాయి. ఈ మహా నగరంలో ఎక్కువ మంది సందర్శించేది లాల్‌బాగ్చ ప్రాంతంలో ఏర్పాటు చేసిన వినాయకుడినే. ఈ విఘ్నేశ్వరుడిని అందరూ లాల్‌బాగ్చ రాజా అని పిలుచుకుంటారు.

లాల్‌బాగ్చ రాజా దర్శనం తర్వాత తన చెప్పులు పోయిన విషయాన్ని వెల్లడిస్తూ ఆమె ఓ ట్వీట్ చేశారు. 'ముంబైలో ప్రసిద్ధిగాంచిన లాల్‌బాగ్చ రాజా దర్శనం తర్వాత మీకు చెప్పులో పోగొట్టుకోకుంటే అందులో మజా ఏముంటుంది?' అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
సర్వర భాస్కర్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆమె ఫరాజ్ ఆరిఫ్ అన్సారీ దర్శకత్వంలో రూపొందుతున్న షీర్ ఖుర్మా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఇందులో ఆమె షబానా అజ్మీ, దివ్య దత్తాతో స్క్రీన్ స్పేస్ పంచుకుంటుంది. ఎల్‌జిబిటిక్యూ కమ్యూనిటీ కథను ఈ సినిమా ద్వారా చెప్పబోతున్నారు. ఈ చిత్రంలో సురేఖా సిక్రీ కూడా కీలక పాత్ర పోషిస్తుంది.


Click it and Unblock the Notifications











