మగాళ్లు ఏం చేసినా ఓకే.. అదే ఆడవాళ్లు చేస్తే, తగ్గని స్వరభాస్కర్.. సూటిగా ప్రశ్నిస్తున్న మహిళలు!
Recommended Video

వీర్ ది వెడ్డింగ్ చిత్రం విడుదలై విజయవంతగా ప్రదర్శితమవుతోంది. నలుగురు యువతులు వారి ఆలోచన విధానాలని చూపించే చిత్రంగా విడుదలైన ఈ చిత్రం అటు విమర్శలు, ప్రశంసలు అందుకుంటోంది. కరీనా కపూర్, సోనమ్ కపూర్, స్వర భాస్కర్, తలసానియా ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. స్వరభాస్కర్ నటించిన ఓ సన్నివేశం పెను దుమారం రేపుతోంది. స్వరభాస్కర్ ఈ చిత్రంలో మాస్టర్ బేషన్ సన్నివేశంలో బోల్డ్ గా నటిచింది. ఈ సన్నివేశమే స్వర భాస్కర్ కు తీవ్ర విమర్శలని తెచ్చిపెడుతోంది.

విమర్శకులకు స్వర భాస్కర్ సమాధానం
సినిమాల్లో మగవాళ్ళు ఎం చేసినా చూపించవచ్చు. కానీ ఆడవాళ్లు చేస్తే మాత్రం అలా చేసింది, ఇలా చేసింది అని వివాదం సృష్టిస్తారు అని స్వర భాస్కర్ అంటోంది. ఈ సన్నివేశంలో నటించే సమయంలోనే తాను ఈ వివాదాన్ని ఊహించానని స్వర తెలిపింది .

మాస్టర్బేషన్ చేయడం
సోషల్ మీడియాలో స్వర భాస్కర్ కు మహిళల నుంచే తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఓ సంధర్భంలో స్వర భాస్కర్ మహిళా సాధికారికత గురించి మాట్లాడింది. మాస్టర్ బేషన్ చేయడం సాధికారత ఎలా అవుతుందని ఓ మహిళ సోషల్ మీడియాలో సూటిగా ప్రశ్నించింది.

వివాదాలతో పబ్లిసిటీ
వివాదాలతో మొదలైన వీర్ ది వెడ్డింగ్ చిత్రానికి బాగానే పబ్లిసిటీ లభిస్తోంది. వీర్ ది వెడ్డింగ్ చిత్రం వారం రోజుల లోపే 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

సినిమా మొత్తం అదే విధంగా
వీర్ ది వెడ్డింగ్ చిత్రం అదేవిధంగా సాగుతుంది. బూతులు, బోల్డ్ సన్నివేశాలతోనే దర్శకుడు నలుగురు యువతుల ఆలోచనలని వెండి తెరపై ఆవిష్కరించాడు.


Click it and Unblock the Notifications











