Kareena Kapoor కొడుకు పేరు వివాదం: ప్రపంచంలోనే పెద్ద గాడిదలు అంటూ రెచ్చిపోయిన నటి!

బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. తన చిన్న కొడుకు పేరు కారణంగా ఒక వర్గం వారు నటిని ట్రోల్ చేస్తున్నారు. వాస్తవానికి కరీనా కపూర్ ఖాన్ ఇటీవల 'కరీనా కపూర్ ఖాన్ ప్రెగ్నెన్సీ బైబిల్' అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో, ఆమె తన చిన్న కుమారుడు జెహ్ యొక్క పూర్తి పేరు వెల్లడించారు. నటి పుస్తకం ప్రకారం, ఆమె చిన్న కుమారుడు పేరు 'జహంగీర్'.

ఈ పేరును వెల్లడించిన తర్వాత, కరీనా కపూర్ మరియు ఆమె భర్త సైఫ్ అలీ ఖాన్ సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ చేయబడుతున్నారు. ఇప్పుడు నటి స్వర భాస్కర్ కొడుకు పేరు కారణంగా కరీనాను ట్రోల్ చేయడం పై స్పందించింది. కరీనా కుమారుడి పేరు గురించి ట్రోల్ చేస్తూ వారిని ఎగతాళి చేస్తున్న వారికి ఆమె తగిన సమాధానమిచ్చారు. స్వర భాస్కర్ సోషల్ మీడియా ద్వారా ట్రోలర్లకు తగిన సమాధానం ఇచ్చారు.

Swara Bhasker Supports Kareena Kapoor Younger Son Name Jahangir

ఆమె తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఇలా వ్రాశారు, 'ఒక జంట తమ పిల్లలకు పేరు పెట్టారు, ఆ జంట మీరు కాదు - కానీ పేర్లు ఏమిటి ? అలాగే ఆ పేర్లు ఎందుకు అనే దానిపై మీకు అభిప్రాయం ఉంటే అది మీ మనస్సులో సమస్య; ఇది మీ మనోభావాలను దెబ్బతీస్తుంటే కనుక మీరు ఈ ప్రపంచంలో అతిపెద్ద గాడిదలలో ఒకరు! అంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేసింది.a అంతేకాక #Jehangir #Mindyourownbusiness ' అంటే మీ పని మీరు చూసుకోండి అంటూ ట్యాగ్ కూడా పెట్టారు. ఇక స్వర భాస్కర్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక స్వర భాస్కర్ అభిమానులు మరియు సోషల్ మీడియా యూజర్లు సైతం ఆమె ట్వీట్‌పై తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక అదే సమయంలో, చిన్న కొడుకు పేరు మాత్రమే కాకుండా, కరీనా కపూర్ కూడా పెద్ద కుమారుడు తైమూర్ పుట్టిన తర్వాత తన అనుభవాలను పుస్తకంలో పంచుకున్నారు.

Swara Bhasker Supports Kareena Kapoor Younger Son Name Jahangir

కరీనా కపూర్ తన పెద్ద కుమారుడు తైమూర్‌కు జన్మనిచ్చినప్పుడు తాను చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తన పుస్తకం ద్వారా వెల్లడించింది. నటి రాసిన పుస్తకం ప్రకారం, ఆమె పుట్టిన తరువాత తన కుమారుడు తైమూర్‌కు తల్లిపాలు ఇవ్వలేకపోయింది. తైమూర్ పుట్టిన తర్వాత దాదాపు 14 రోజుల పాటు కరీనా కపూర్ కి ఈ ఇబ్బంది కొనసాగింది. కరీనా కపూర్ తన పుస్తకంలో 'తైమూర్ అకస్మాత్తుగా సిజేరియన్ (ఆపరేషన్) ద్వారా జన్మించడంతో 14 రోజుల పాటు, తల్లి పాలు నాలో ఉత్పత్తి కాలేదు. నేను పూర్తిగా ఎండిపోయినట్టు అనిపించిందని పెర్కోన్నారు.

అప్పుడు నా తల్లి మరియు నా నర్సులు నా ముందు కొట్టుమిట్టాడుతూ నా బ్రెస్ట్ నొక్కుతూ, తల్లి పాలు ఎందుకు రావడం లేదు అని ఆలోచిస్తున్నారని కానీ జెహ్ విషయంలో ఇది నాకు జరగలేదని వెల్లడించింది. ఇక ఈ ఇద్దరూ కలిసి వీరేకీ వెడ్డింగ్ సినిమాలో నటించారు. కరీనా ఇప్పుడు అమీర్ ఖాన్ సరసన లాల్ సింగ్ చద్దాలో కనిపిస్తుంది. ఈ చిత్రం క్రిస్మస్ 2021 సందర్భంగా విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X