కరోనా వచ్చిన నటికి చావమంటూ శాపనార్థాలు.. అందరికీ ఒకేసారి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిందిగా!
దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం మళ్ళీ రోజు వారీ కరోనా కేసుల సంఖ్య లక్ష మార్కు దాటుతున్నాయి. కోవిడ్ థర్డ్‌వేవ్‌లో సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా ఎక్కువగా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. అలా కరోనా బారిన పడిన స్వరా భాస్కర్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఆ వివరాలు

కరోనా పాజిటివ్‌గా
బాలీవుడ్ నుంచి జాన్ అబ్రహం, నిర్మాత ఏక్తా కపూర్, కరీనా కపూర్, అర్జున్ కపూర్, అన్షుల కపూర్, టాలీవుడ్ హీరో మహేష్ బాబు, మ్యూజిక్ డైరెక్టర్ థమన్, హీరోయిన్ త్రిష మంచు లక్ష్మి వంటి వారు కరోనా బారిన పడ్డారు. ఈ క్రమంలో మరో నటికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. బాలీవుడ్ నటి స్వర భాస్కర్‌కి కోవిడ్ సోకింది.
ఈ మేరకు నటి స్వర భాస్కర్ గురువారం రాత్రి తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. తనతో కాంటాక్ట్ అయిన వారు పరీక్షలు చేయించుకోవాలంటూ ఆమె కోరింది. ఈ సందర్భంగా అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరింది.

తరచూ ట్రోలింగ్ కి
అయితే మామూలుగానే ఆమెకు కాస్త నోటి దురద ఎక్కువ కావడంతో ఎక్కువగా తరచూ ట్రోలింగ్ కి గురవుతుంటుంది. ఆమె గతంలో చేసిన వ్యాఖ్యలు, నటించిన కొన్ని పాత్రల కారణంగా నెటిజన్లు ఆమెను చాలా సార్లు ట్రోల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మరోసారి స్వరాను టార్గెట్ చేశారు నెటిజన్లు. కరోనా బారిన పడిన ఆమె ఏకంగా చనిపోవాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.

టార్గెట్ చేస్తూ
ఆమెకు కరోనా వచ్చింది అని తెలుసుకున్న నెటిజన్లు ఆమెను కావాలనే టార్గెట్ చేస్తూ పలు కామెంట్స్ చేశారు. 'చచ్చిపో.. నీకు నరకంలో కూడా చోటుండదు' అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. 'త్వరగా నరకానికి పోయి.. ఈ భూమికి ఉన్న భారాన్ని తగ్గించు' అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇలా ఒక్కొక్కరూ స్వరా భాస్కర్ పై దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు.
ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా
అయితే ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఈ పోస్ట్ లకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను తన సోషల్ మీడియాలో షేర్ చేసిన స్వరా.. 'ఫ్రెండ్స్.. మీ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోండి.. నిజంగా నాకేమైనా అయితే మీ జీవనాధారాన్ని కోల్పోతారు.. అప్పుడు ఇంటిని ఎలా నడిపిస్తారు..?' అంటూ తాను వాళ్ళ కుటుంబ సభ్యురాలిని అన్నట్టు కౌంటర్ వేసింది.

ధన్యవాదాలు
ఇక ఆ తరువాత అందరి ప్రేమ, స్వస్థత శుభాకాంక్షలు మరియు త్వరగా కోలుకోవాలి అని అందరూ పెడుతున్న మెసేజ్ లకు ధన్యవాదాలు, ఇక ఇది చాలా అంటే చాలా ఎక్కువ! క్షమించండి, నేను వాటిలో ప్రతిదానికి ప్రత్యుత్తరం ఇవ్వలేకపోతున్నాను, కానీ చాలా కృతజ్ఞతలు, మిమ్మల్ని మరియు మీ ప్రియమైన వారిని జాగ్రత్తగా చూసుకోండి అని ఆమె కోరింది. ఇక . స్వర భాస్కర్.. సల్మాన్ ఖాన్ సరసన 'ప్రేమ్ రతన్ ధన్ పాయో', కంగనా రనౌత్ ప్రధాన పాత్ర పోషించిన 'తను వెడ్స్ మను' సినిమాలతో పాపులారిటీ సాధించింది.


Click it and Unblock the Notifications











