ఒంటరిగా హీరోయిన్ 1400 కి.మీ. ప్రయాణం.. గాయపడిన తల్లి కోసం ఎంత రిస్కంటే
కరోనా లాక్‌డౌన్‌లో సెలబ్రిటీల నుంచి సాధారణ పౌరుల వరకు అనుభవించిన కష్టాలు మాటల్లో చెప్పడం కష్టమే. గత రెండు నెలలకుపైగా గృహ నిర్బంధంలో ఎంతో మానసిక వేధన, ఆవేదనను తన వాళ్ల కోసం అనుభవించిన సంఘటనలు కోకొల్లలు. ఇలాంటి కష్టాలు బాలీవుడ్ నటి స్వర భాస్కర్‌కు తప్పలేదు. తల్లిని కలిసేందుకు ఒంటరిగా రోడ్డు ప్రయాణం సాగించింది.. కష్టాల్లో ఉన్న తల్లిని కలిసేందుకు స్వర భాస్కర్ ఎంత రిస్క్ తీసుకొన్నారంటే..

స్వర భాస్కర్ తల్లికి గాయం
బాలీవుడ్ నటి స్వర భాస్కర్ తల్లి ఇరా భాస్కర్ ఢిల్లీలో నివాసం ఉంటున్నారు. ఆమె జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. గతవారం ఆమె స్వల్పప్రమాదానికి లోనవ్వడంతో భుజానికి తీవ్రమైన గాయమైంది. తల్లి ప్రమాదం గురించి తెలుసుకొని తల్లడిల్లిపోయింది. ఢిల్లీకి వెళ్లాలంటే లాక్‌డౌన్ నిబంధనలు అడ్డుపడ్డాయి. ఇక చేసేదేమీ లేక ఫోనులోనే పరామర్శలు చేస్తూ కాలం వెళ్లదీసింది.

లాక్‌డౌన్ సడలింపుల తర్వాత
ఇక లాక్‌డౌన్ సడలింపుల లభించడంతో అధికారుల నుంచి అనుమతులు తీసకొన్నారు. మరో నిమిషం ఎదురు చూడకుండా కారులో ఢిల్లీకి బయలు దేరారు. 1400 కిలోమీటర్ల దూరం రోడ్డు మార్గం ద్వారా ప్రయాణం చేశారు. మార్గ మధ్యంలో ఉదయ్ పూర్ వద్ద నైట్ హాల్ట్ చేశారు. చివరకు వ్యయ ప్రయాసల మధ్య స్వర భాస్కర్ బుధవారం ఢిల్లీకి చేరుకొన్నారు. తల్లిని చూసి ఆవేదనకు చెందారు. గాయం గురించి అడిగి తెలుసుకొని ఊరట చెందారు.

ఢిల్లీలో అధికారుల ఝలక్
ఇక ముంబై నుంచి ఢిల్లీకి చేరిన స్వరభాస్కర్‌కు ఢిల్లీ ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. కరోనావైరస్ నిర్ధారిత పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు. అలాగే నిబంధనలు పాటిస్తూ క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించారు. దాంతో తల్లి ఆరోగ్యాన్ని చూసుకొంటూ మరో 14 రోజులు ఢిల్లీలో స్వీయ గృహ నిర్బంధాన్ని స్వర భాస్కర్ పాటించనున్నారు.
Recommended Video

నవాజుద్దీన్ సిద్ధిఖికి కూడా
ఇక లాక్‌డౌన్ తర్వాత ఇలాంటి పరిస్థితే ఎదురైన వారిలో నవాజుద్దీన్ సిద్ధిఖి కూడా ఉన్నారు. తన తల్లి, సోదరుడితో కలిసి ముంబై నుంచి ఉత్తర ప్రదేశ్‌లోని బుధానా గ్రామానికి వెళ్లారు. దాంతో అతడిని 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు ఆదేశించారు. దాంతో ఆయన ప్రస్తుతం స్వీయ గృహ నిర్బంధాన్ని పాటిస్తున్నారు. కాగా, నవాజుద్దీన్ సిద్ధిఖీకి ఆయన భార్య ఇటీవల విడాకుల నోటీసులు పంపిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











