ఇలాంటి సమయంలో మోడీని కెలికిన స్వరభాస్కర్.. ఆడేసుకుంటున్న నెటిజన్లు!

పుల్వామా ఘటనకు భారత్ తిరుగులేని ప్రతీకారం తీర్చుకుంది. నేరుగా పాక్ భూభాగంలోకి ప్రవేశించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మిరాజ్ యుద్ధ విమానాలు జైషే మహమ్మద్ టెర్రర్ ట్రైనింగ్ క్యాంప్ ని నేలమట్టం చేసి వచ్చాయి. దీనిని అంతా సర్జికల్ స్ట్రైక్ 2గా అభివర్ణిస్తున్నారు. ఈ దాడిలో దాదాపు 300 మంది ఉగ్రవాదుల మరణించినట్లు భారత ప్రభుత్వం ధ్రువీకరించింది. దీనితో ఇండియా, పాక్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇలాంటి సమయంలో స్వర భాస్కర్ ప్రధాని నరేంద్ర మోడీని కెలికి తగిన మూల్యం చెల్లించుకుంది.

రాత్రంతా నిద్ర లేకుండా

రాత్రంతా నిద్ర లేకుండా

సోమవారం తెల్లవారు జామున 3: 40 గంటలకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మిరాజ్ యుద్ధ విమానాలు పాక్ భూభాగంలోకి ప్రవేశించి ఆపరేషన్ ప్రారంభించాయి. దాదాపు 20 నిమిషాల పాటు 12 మిరాజ్ యుద్ధ విమానాలు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నాయి. ఆ రాత్రంతా ప్రధాని నరేంద్ర మోడీ నిద్రలేకుండా గడిపినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ విజయవంతం అయ్యే వరకు ఆయన పర్యవేక్షిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

క్షేమంగా తిరిగి వచ్చాక

క్షేమంగా తిరిగి వచ్చాక

జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరాలని నేలమట్టం చేసి, క్షేమంగా పైలెట్స్ అందరూ ఇండియాకు తిరిగి వచ్చే వరకు ప్రధాని మేల్కొనే ఉన్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ విజయవంతం అయిందని తెలుసుకున్న తర్వాత మోడీ విశ్రాంతి తీసుకున్నారట. మోడీ గురించి వస్తున్న ఈ వార్తలపై బాలీవుడ్ నటి స్వర భాస్కర్ స్పందించింది. ఆమె స్పందన కాస్త విమర్శాత్మకంగా ఉండడంతో నెటిజన్లు ఆగ్రహానికి గురవుతున్నారు.

 ఆయన డ్యూటీ

ఆయన డ్యూటీ

స్వర భాస్కర్ స్పందిస్తూ.. మోడీ రాత్రంతా నిద్రలేకుండా ఉన్నారా.. ఇందులో గొప్పేముంది.. అది ఆయన డ్యూటీ అని ట్వీట్ చేసింది. దీనితో నెటిజన్లు స్వర భాస్కర్ పై విరుచుకు పడుతున్నారు. ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ.. నీవు రోజుకు కనీసం 18 గంటలు పని చేయగలవా.. చేయలేవు.. ఎందుకంటే నీకు అసలు ఏ పనీ లేదు అని ఘాటుగా బదులిచ్చాడు.

 సినిమాల్లో మాత్రమే

సినిమాల్లో మాత్రమే

మరో నెటిజన్ కామెంట్ చేస్తూ.. నిన్ను సినిమాల్లో మాత్రమే అభినందిస్తాం. ఇలాంటి విషయాల గురించి మాట్లాడితే అభినందించడం నేర్చుకో.. లేకుంటే సైలెంట్ గా ఉంది అని సమాధానం ఇచ్చాడు. అవును.. ఇది మోడీ జాబ్ లో భాగమే. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఇండియన్ సిటిజన్ గా విమర్శించడం మాని, అభినందించడం నేర్చుకో అని మరో నెటిజన్ ఫైర్ అయ్యాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X