twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శిల్పాశెట్టికి చేదు అనుభవం.. రెండోసారి ఘోర అవమానం!

    |

    Recommended Video

    Shilpa Shetty Trolled For Her Racism Rant

    విదేశాల్లో భారతీయ సినిమా స్టార్లకు చేదు అనుభవాలు ఎదురుకావడం కొత్తేమీ కాదు. తాజాగా విమానాశ్రయ సిబ్బంది వల్ల బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ఇబ్బందుల పాలైంది. ఆస్ట్రేలియాలో లగేజీ తూకం విషయంలో ఎయిర్‌పోర్ట్ స్టాఫ్ దురుసుగా ప్రవర్తించడం వివాదంగా మారింది. శిల్పాశెట్టిపై జాత్యంహంకార వ్యాఖ్యలు చేసినట్టు కూడా వార్తలు వెలువడుతున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..

    నా లగేజ్ చెకింగ్ వద్ద

    నా లగేజ్ చెకింగ్ వద్ద

    ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా సిడ్నీ నుంచి మెల్‌బోర్న్‌కు ప్రయాణిస్తున్నాను. లగేజ్ చెకింగ్ కౌంటర్ వద్ద విమానాశ్రయ సిబ్బంది నాతో చాలా ఇబ్బందికరంగా ప్రవర్తించింది. అమెరికా ప్రయాణికురాలితో మర్యాదగా మాట్లాడిన సిబ్బంది, నాతో చాలా దురుసుగా వ్యవహరించింది.

    నిర్లక్ష్యంగా బిహేవ్ చేయడంతో

    నిర్లక్ష్యంగా బిహేవ్ చేయడంతో

    నేను బిజినెస్ క్లాస్‌లో ప్రయాణిస్తున్నాను. నా వద్ద నిబంధనలకు అనుగుణంగా రెండు బ్యాగులు ఉన్నాయి. అందులో సగం ఖాళీగా ఉన్న ఓ బ్యాగ్‌ను చూసి ఇది ఓవర్ లగేజ్ అని అభ్యంతరం తెలిపింది. తాను తనిఖీ చేయకుండా చాలా నిర్లక్ష్యంగా బిహేవ్ చేస్తూ వేరే కౌంటర్‌కు పంపమని చెప్పింది.

    మరో సిబ్బంది ఓవర్ లాగేజ్ కాదని

    మరో సిబ్బంది ఓవర్ లాగేజ్ కాదని

    సిబ్బంది ప్రవర్తన నచ్చకపోయినా నేను వెళ్లి వేరే కౌంటర్‌లో తూకం వేయించాను. నా లగేజ్‌ను పరిశీలించిన సిబ్బంది అదనంగా బరువేమి లేదు అని చెప్పారు. కానీ మళ్లీ అదే వ్యక్తి నా బ్యాగ్ ఓవర్ లగేజ్ అని రెండోసారి కూడా అభ్యంతరం చెప్పడం నాకు విస్మయం కలిగించింది.

    శరీరం రంగు చూసి చెడుగా

    శరీరం రంగు చూసి చెడుగా

    సిబ్బంది వ్యవహారంతో కాలయాపన జరిగింది. ఫ్లయిట్ సమయం దగ్గరపడుతుంది. దాంతో నేను అదే బ్యాగ్‌ను వేరే సిబ్బందికి ఇచ్చి లగేజ్ చెకింగ్ పూర్తి చేయించుకొన్నాను. విమానాశ్రయంలో ప్రయాణికులకు సిబ్బంది చేదోడు వాదోడుగా ఉండాలి. నమ్రతతో మాట్లాడాలి. కానీ శరీరం రంగు చూసి విపరీత బుద్దిని ప్రదర్శించవద్దు అని శిల్పాశెట్టి తన ఇన్స్‌టాగ్రామ్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.

     శిల్పాశెట్టికి ఎయిర్‌లైన్స్ క్షమాపణ

    శిల్పాశెట్టికి ఎయిర్‌లైన్స్ క్షమాపణ

    శిల్పాశెట్టికి జరిగిన చేదు అనుభవంపై క్వాంటాస్ ఎయిర్‌పోర్ట్ స్పందించింది. అవమానకరంగా శిల్పాకు జరిగిన సంఘటనకు చింతిస్తున్నాం. మీ ఫిర్యాదుపై విచారణ చేపట్టాలని సంబంధిత టీమ్‌ను ఆదేశించాం. మీ ప్రయాణం ప్రశాంతంగా జరిగిందని భావిస్తున్నాం అని ట్విట్టర్‌లో కాంటాస్ ఓ పోస్ట్ పెట్టింది.

     గతంలోనూ ఇలాంటి చేదు అనుభవమే

    గతంలోనూ ఇలాంటి చేదు అనుభవమే

    శిల్పాశెట్టికి ఇలాంటి వర్ణ వివక్ష, జాత్యాంహకారానికి గురికావడం ఇదే మొదటిసారి. బ్రిటీష్ బిగ్‌బాస్ షొ ఐదో సీజన్ సెలబ్రిటీ బిగ్ బ్రదర్‌లో కూడా రూడీ నుంచి ఇలాంటి సంఘటననే ఎదుర్కొన్నది. శిల్పాను నల్లజాతీయురాలంటూ కామెంట్ చేయడం అప్పట్లో పెను వివాదంగా మారింది. ఆ షోలో శిల్పాశెట్టి విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.

    English summary
    Actor-entrepreneur Shilpa Shetty Kundra on Sunday alleged that she faced an unpleasant experience for being “brown” at the Sydney airport over her cabin luggage. Upset by an official who was curt, she says people’s tone must not change with preference to colour.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X