నా భర్తని టార్గెట్ చేశారు.. ఇలాంటి వాళ్ళు శ్రీకృష్ణుడిపై కూడా నిందలు వేస్తారు.. నటి దివ్య ఖోస్లా!

Recommended Video

#Metoo : Divya Khosla Responds On Her Husband

బాలీవుడ్ వేదికగా మీటూ ఉద్యమ సెగ కొనసాగుతోంది. పలువురు దర్శకులు, నిర్మాతలు, నటులు మీటూ వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తీవ్రమైన ఆరోపణలతో వారి చేతుల్లో ఉన్న చిత్రాలు కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోంది. కొంతమంది ఇప్పటికే అలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు. లైంగిక వేధింపులు ఎదుర్కొన కొంతమంది నటీమణులు ధైర్యంగా ఆరోపణలు చేస్తుండడంతో బాలీవుడ్ కుదుపునకు లోనవుతోంది. అదే సమయంలో మీటూ ఉద్యమాన్ని విమర్శించే వారు కూడా పెరుగుతున్నారు. ఊరూ పేరు తెలియని వారు కూడా ఎలాంటి ఆధారాలు లేకుండా నిందలు వేస్తున్నారనే విమర్స ఎక్కువవుతోంది. తాజాగా టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్ పై వివరాలు తెలియని నటి ఆరోపణలు చేసింది.

 టి సిరీస్ అధినేతపై

టి సిరీస్ అధినేతపై

బాలీవుడ్ నిర్మాత, టి సిరీస్ అధినేత అయిన భూషణ్ కుమార్ పై సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. గుర్తు తెలియని ఓ నటి సోషల్ మీడియా వేదికగా భూషణ్ తనని లైంగికంగా వేధించినట్లు పేర్కొంది. దీనితో భూషణ్ తరుపు నుంచి కూడా అంతే స్థాయిలో ఘాటుగా రియాక్షన్ వచ్చింది.

మూడు సినిమాల్లో ఛాన్స్

మూడు సినిమాల్లో ఛాన్స్


మూడు సినిమాల్లో అవకాశం ఇస్తానని భూషణ్ కుమార్ తనని వేధించాడని ఆ నటి పేర్కొంది. తనతో పడుకుంటే మూడు సినిమాల్లో ఖాయం అని చెప్పాడు. తాను ఒప్పుకోకపోవడంతో తనకు ఎలాంటి అవకాశాలు రాకుండా చూశాడని ఆనతి ఆరోపించింది. ఆమె ఆరోపణలని భూషణ్ కుమార్ ఖండించడమే కాదు, కేసు కూడా నమోదు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై అసత్య ఆరోపణలు చేసిందని ఫిర్యాదు చేశాడు.

 స్వార్థం కోసం

స్వార్థం కోసం

తన భర్తపై వచ్చిన ఆరోపణలపై భూషణ్ కుమార్ సతీమణి, నటి దివ్య ఖోస్లా ఘాటుగా స్పందించింది. మీటూ ఉద్యమం దారితప్పుతోందని వ్యాఖ్యానించింది. కొంతమంది తమ స్వార్థం కోసం ఇతరులపై దారుణమైన ఆరోపణలు చేస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇతరులపై ఆరోపణలు చేసి సమాజాన్ని శుభ్రపరుస్తున్నామే ముసుగులో దాక్కుంటున్నారని దివ్య ఘాటు విమర్శలు చేసింది.

దేవుడిపై కూడా నిందలు

ఇలాగే వదిలేస్తే ఇలాంటి వాళ్లంతా చివరకు భగవంతుడు శ్రీకృష్ణుడిపై కూడా మీటూ పేరుతో నిందలు వేస్తారని దివ్య సంచలనం కామెంట్స్ చేసింది. నా భర్త ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారు. నా భర్త విలువలు పాటించే వ్యక్తి అని దివ్య అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X