ఆ వార్తలు చాలా బాధను కలిగించాయి.. అమితాబ్‌పై తాప్సీ కామెంట్స్

ఈ మధ్య తాప్సీ పేరు మీడియాలో, సోషల్ మీడియాలో తెగ మార్మోగిపోతోంది. ఈ ఇంటర్వ్యూలో పాల్గోన్న తాప్సీ అనేక విషయాలను వెల్లడించడం, అనేక మందిపై సెటైరికల్‌గా స్పందించడంతో వార్తలో వైరల్ అవుతోంది. అంతేకాకుండా ప్రస్తుతం గోవాలో జరుగుతున్న IFFI వేడుకలో తాప్సీ ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. కంగనా, రంగోలి, జాక్వెలిన్, విక్కీ కౌశల్‌పై చేసిన కామెంట్స్ మరువక ముందే బిగ్ బీ అమితాబ్‌పై చేసిన కామెంట్స్ చక్కర్లు కొడుతున్నాయి.

 ఇంగ్లీష్‌లో మాట్లాడిన తాప్సీ..

ఇంగ్లీష్‌లో మాట్లాడిన తాప్సీ..

గోవాలో జరుగుతున్న IFFI వేడుకలో తాప్సీ మీడియాతో కాసేపు ముచ్చటించింది. ఈ సమయంలో ఆమె పూర్తిగా ఇంగ్లీష్ భాషలోనే మాట్లాడింది. కేవలం హిందీలోను ఎందుకు మాట్లాడుతున్నారు.. హిందీలో కూడా మాట్లాడొచ్చు కదా అని ప్రశ్నించాడు. అయితే ఆ భాష ఇక్కడున్న అందరికీ అర్థం కాకపోవచ్చు అందుకే ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నానని చెప్పుకొచ్చింది. కావాలంటే నేను పూర్తిగా హిందీలోనే మాట్లాడగలను.. మాట్లాడమంటారా? అని అంటే వద్దని అక్కడున్న వారు కోరారు.

దక్షిణాది నటిని కూడా..

దక్షిణాది నటిని కూడా..

ఆ సమాధానంతో సంతృప్తి చెందని సదరు వ్యక్తి.. హిందీ సినిమాల్లో నటిస్తూ హిందీలో మాట్లాడరా? అంటూ ప్రశ్నించాడు. తాను దక్షిణాదికి చెందిన నటిని.. తెలుగు, తమిళంలో మాట్లాడితే ఓకేనా అంటూ తాప్సీ ఇచ్చిన కౌంటర్‌‌తో అతని నోరు మూసుకుపోయింది. ఈ సమాధానం చెప్పగానే హర్షద్వానాలతో తాప్సీకి చప్పట్లు కొట్టారు.

వారిద్దరికీ కౌంటర్..

వారిద్దరికీ కౌంటర్..

ఈ షోలో కంగనా, రంగోలి గురించి స్పందిస్తూ.. వారిద్దరికి నేనంటే చాలా ప్రేమ, వారు నన్ను ప్రేమించినంతగా నేను వారిని ప్రేమించలేకపోతున్నాను.. నా గురించి వారు ఎక్కువగా సమయం కేటాయిస్తూ, నా గురించే ఆలోచిస్తుంటారు.. వారికి నిజంగానే నేనంటే ఎంతో ప్రేమ అంటూ గట్టి కౌంటర్ ఇచ్చింది. తనకు ఎదురైన మరొక ప్రశ్నకు అందర్నీ ఆశ్చర్య పరిచే సమాధానం చెప్పింది. నీ కెరీర్లో వరస్ట్ కో స్టార్స్ ఎవరు అంటూ తాప్సిని సదరు యాంకర్ ప్రశ్నించింది. అందుకు తాప్సి తడుముకోకుండా జాక్వాలిన్ ఫెర్నాండెజ్ మరియు విక్కీ కౌశల్ అంటూ చెప్పింది. తన కంటే అందంగా ఉంటుందని జాక్వెలిన్‌ను, బాగా యాక్ట్ చేస్తాడని విక్కీని వరెస్ట్ కోస్టార్స్ అంటూ వారు పాజిటివ్‌లను చెప్పుకొచ్చింది.

ఆ వార్తలు చాలా బాధను కలిగించాయి..

ఆ వార్తలు చాలా బాధను కలిగించాయి..

తాజాగా ఒక ఇంటర్వ్యూలో తాప్సి మాట్లాడుతూ.. బద్లా సినిమా కోసం తాను చాలా కష్టపడినట్లు పేర్కొంది. ఆ సినిమాలో తన పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉందని, అందులో అమితాబ్ కంటే తనకే సీన్స్ ఎక్కువగా ఉంటాయని తెలిపింది. ఆయన కంటే తాను ఎక్కువ రోజులు షూటింగ్‌లో పాల్గొన్నానని చెప్పుకొచ్చింది. అయినా కూడా ఆ సినిమా అమితాబ్‌దే అంటూ టాక్ వచ్చిందని చెప్పుకొచ్చింది. ఆ విషయం తనకు చాలా నిరుత్సాహాన్ని కలిగించిందని, తాను పడ్డ కష్టానికి తనకు పేరు రావాలని కోరుకున్నట్లు తెలిపింది. కానీ అది బిగ్ బి సినిమా అంటూ వార్తలు రావడం తనకు చాలా బాధను కలిగించాయని అంది.

Recommended Video

#CineBox : Fans Begin Countdown For RRR,With #250daystomassiveRRR
పారితోషికాలు ఎలాగూ ఇవ్వరు కనీసం..

పారితోషికాలు ఎలాగూ ఇవ్వరు కనీసం..

ఆ విషయాన్ని తాను గతంలోనే చెప్పానని తెలిపింది. అప్పుడు తనకు కాస్త గుర్తింపు దక్కేలా చేశారని, ఇంకా కొన్ని సినిమాల విషయంలో కూడా ఇలాగే జరిగిందంటూ తాప్సి ఆవేదన వ్యక్తం చేసింది. పడ్డ కష్టానికి హీరోల స్థాయిలో పారితోషికాలు ఎలాగూ ఇవ్వడం లేదనీ, కనీసం గుర్తింపు అయినా దక్కాలని ఆశిస్తున్నామంటూ తాప్సీ చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X