కేవలం బాడీ చూపించడమే కాదు.. ఆమెకు వారు అవసరం.. తాప్సీ కామెంట్స్
కొందరు సెలెబ్రిటీలు కాంట్రవర్సీకి ఎంత దూరంగా ఉంటారో మరికొందరు కావాలని కొని తెచ్చుకునే వారు కూడా ఉంటారు. ఉన్నది ఉన్నట్టు మొహమాటంగా చెప్పడం అందరూ చేయలేరు. ఇలా ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే కాంట్రవర్సీలు చుట్టుముడుతుంటాయి. తాజాగా తాప్సీ చేసిన కొన్ని కామెంట్లు వివాదాలు సృష్టించేలా ఉండగా.. మరికొన్ని ఆమె మాటకారి తనాన్ని ప్రదర్శిస్తున్నాయి. అందంలోనే కాదు తెలివిలోనూ అందరి కంటే ఎక్కువేనని నిరూపించుకుంటూ ఉంది.

వారిద్దరికీ కౌంటర్..
తాప్సీ తాజాగా సాండ్ కీ ఆంఖ్ అనే చిత్రంతో భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇదే ఊపులో ఉన్న తాప్సీ తాజాగా ఓ షోలో పాల్గొంది. ఈ షోలో కంగనా, రంగోలి గురించి స్పందిస్తూ.. వారిద్దరికి నేనంటే చాలా ప్రేమ, వారు నన్ను ప్రేమించినంతగా నేను వారిని ప్రేమించలేకపోతున్నాను.. నా గురించి వారు ఎక్కువగా సమయం కేటాయిస్తూ, నా గురించే ఆలోచిస్తుంటారు.. వారికి నిజంగానే నేనంటే ఎంతో ప్రేమ అంటూ గట్టి కౌంటర్ ఇచ్చింది.

వారే వరెస్ట్ కో స్టార్..
తనకు ఎదురైన మరొక ప్రశ్నకు అందర్నీ ఆశ్చర్య పరిచే సమాధానం చెప్పింది. నీ కెరీర్లో వరస్ట్ కో స్టార్స్ ఎవరు అంటూ తాప్సిని సదరు యాంకర్ ప్రశ్నించింది. అందుకు తాప్సి తడుముకోకుండా జాక్వాలిన్ ఫెర్నాండెజ్ మరియు విక్కీ కౌశల్ అంటూ చెప్పింది. తన కంటే అందంగా ఉంటుందని జాక్వెలిన్‌ను, బాగా యాక్ట్ చేస్తాడని విక్కీని వరెస్ట్ కోస్టార్స్ అంటూ వారు పాజిటివ్‌లను చెప్పుకొచ్చింది.

తాజాగా ఆమెపై బోల్డ్ కామెంట్స్
బాలీవుడ్ క్రేజీ స్టార్ ఊర్వశీ రతౌలాపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆమెకు మంచి శరీరమే ఉంది.. అందాన్ని ప్రదర్శించేవే కాకుండా మంచి బట్టలు వేసుకుంటే చూడాలనిపిస్తోంది.. ఆమెకు ఓ మంచి స్టైలిష్ట్ అవసరమనిపిస్తోందని షాకింగ్ కామెంట్స్ చేసింది.
Recommended Video

వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీ
ఈ ఏడాది తాప్సీ.. బద్లా, గేమ్ ఓవర్, మిషన్ మంగళ్, సాండ్ కీ ఆంఖ్ లాంటి చిత్రాలతో పలకరిచింది. అన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించడమే కాకుండా.. నటిగా మంచి పేరును తీసుకొచ్చింది. తాప్సీ ప్రస్తుతం తప్పడ్, తడ్కా చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











